Smriti Mandhana గురించి మీకు తెలియని విషయాలు!

  • Dec 07, 2020, 13:09 PM IST

Smriti Mandhana | స్మృతి మంథాన మహిళా క్రికెట్ క్వీన్. ఒక సంచలనం కూడా. చిత్తు శుద్ధితో రికార్డులు బ్రేక్ చేసే స్పోర్ట్స్ వుమెన్. స్మృతి మంథాన గురించి మీకు తెలియని 10 ఆసక్తికరమైన విషయాలివే.
 

1 /9

స్మృతి కుటుంబానికి క్రికెట్‌కు బ్యాగ్రౌండ్ ఉంది. సాంగ్లిలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో మంథాన తండ్రి, సోదరుడు ఇద్దరూ క్రికెట్ ఆడారు. ఆమె సోదరుడు మహారాష్ట్ర అండర్ 16లో కూడా ఆడాడు.

2 /9

9 ఏళ్ల వయసులోనే స్మృతి మంథాన మహారాష్ట్ర అండర్15  జట్టుకు ఎంపికైంది.  11 ఏళ్లకు అండర్ 19కు ఆడి తన సత్తా చాటింది.

3 /9

స్మృతి మంథాన కెరియర్‌ను 2013లో జరిగిన వన్డే మ్యాచులో స్మృతి మంథాన తొలి డబుల్ సెంచరీ మలుపు తిప్పింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

4 /9

2014లో జరిగిన వరల్డ్ టీ20 కప్ కోసం స్మృతి మంథాన తన 12వ తరగతి ఎగ్జామ్స్‌కు దూరం అయింది

5 /9

మైదానంలో బ్యాటింగ్‌తో విరుచుకుపడే స్మృతి మంథాన నార్మల్ లైఫ్‌లో మాత్రం చాలా సరదాగా ఉంటుంది.  

6 /9

స్మృతి మంథానకు మాథ్యూ హెడెన్ అంటే ఇష్టం.. కానీ బ్యాగింగ్ స్టైల్ మాత్రం సంగర్కర స్టైల్లో ఉండేలా చూసుకుంటుందట.

7 /9

స్మృతి మంథాన షెడ్యూల్ ప్రిపేర్ చేయడంలో ఫ్యామిలీ చాలా సహాయం చేస్తుందట.

8 /9

2014లో ఇంగ్లాండ్‌లోని వార్మ్‌స్లీ పార్క్‌లో జరిగిన వన్డే మ్యాచులో తెరంగేట్రం చేసింది.

9 /9

2017లో మహిళ ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించి.. పిన్నవయసులోనే వరల్డ్ కప్‌లో ( World Cup Century ) సెంచురీ సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x