Fake Police Video Call: రియల్‌ పోలీసులకే వీడియో కాల్ చేసి దమ్‌ కి ఇచ్చిన ఫేక్ పోలీస్.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే పడి పడి నవ్వాల్సిందే!

Fake Police Video Call Scam: ఓ నకిలీ పోలీసు రియల్ పోలీసులకు కాల్ చేసిన ఘటన కేరళలో జరిగింది. ఇందులో నకిలీ పోలీస్ రియల్ పోలీసులను అడిగిన ప్రశ్నలు అందరినీ నవ్వు పుట్టించే విధంగా ఉన్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

Fake Police Video Call Scam: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ విపరీతంగా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ లో ఏదో ఒక సైబర్ నేరం గురించి చదువుతూ ఉంటాం. ఈ సైబర్ నేరాల వల్ల ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అమాయకపు ప్రజలు బాధితులు అవుతున్నట్లు ఇటీవల కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని గేటు గాళ్లు కొత్త కొత్త ట్రిక్కులతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

1 /5

ఈ ఘటన ఏమిటో కాదు.. ఓ కేటుగాడు నకిలీ పోలీసు దుస్తులు ధరించి ఏకంగా రియల్ పోలీస్ కే వీడియో కాల్ చేశాడు.. ఆయన పోలీసుల్లోనే ఉన్నత అధికారని తెలిసి.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు.. ఇంతకీ చివరికి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసా?  

2 /5

కేరళకు చెందిన ఓ సైబర్ కేటుగాడు పోలీస్ అధికారికి వీడియో కాల్ చేశాడు. ఈ వీడియో కాల్ లో ఆ కేటుగాడు నకిలీ పోలీసు దుస్తులను ధరించి ఉన్నాడు. అయితే ఆ వీడియో కాల్ లో రియల్ పోలీస్ అధికారిని.. మీరు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.. దీంతో ఆ పోలీస్ అధికారి త్రిసూర్ పోలీస్‌ అధికారి అని సమాధానమిచ్చాడు.   

3 /5

రియల్ పోలీస్ అధికారి అలా సమాధానమివ్వడంతో ఆ కేటుగాడు తన ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదంటూ యాక్టింగ్ చేశాడు. ఒకటికి రెండుసార్లు దుండగుడు వీడియో కాల్ లో మాట్లాడుతుంది పోలీస్ అధికారేనాని పరీక్షించి.. నిజమైన పోలీస్ అని తెలియగానే షాక్ అయ్యాడు.   

4 /5

ఆ కేరళ సైబర్ పోలీసులు ఎంతో స్పీడ్ గా ఉండడంతో.. వీడియో కాల్ మాట్లాడుతుండగానే ఆ దుండగుడి పూర్తి వివరాలు క్షణాల్లో రాబట్టేశారు. అంతేకాకుండా ఆ పోలీస్ అధికారి దుండగుడితో మీ పూర్తి వివరాలు మాకు తెలిసిపోయాయని చెప్పడంతో మరోసారి షాక్ అయ్యాడు.   

5 /5

ప్రస్తుతం ఈ సైబర్ కేటుగాడికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అంతేకాకుండా చాలామంది విమర్స్ ఈ వీడియో క్లిప్ ను మీన్స్ లో కూడా వాడుకుంటున్నారు. అలాగే నేటిజన్స్ ఈ వీడియో పై భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.