Fenugreek seeds vs fenugreek leaves:మెంతి కూర vs మెంతులు.. ఎందులో ఔషధగుణాలు ఎక్కువ..డయాబెటిస్ కంట్రోల్ కోసం వేటిని తినాలి..?

Health Benefits Of Fenugreek: మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మెంతులు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. మరి మెంతులు, మెంతికూర ఈ రెండింటిలో ఎందులో ఔషదగుణాలు ఎక్కువగా ఉన్నాయి. డయాబెటిస్ కంట్రోల్  చేయాలంటే రెండింటిలో ఏది తీసుకోవాలి. పూర్తి వివరాలు తెలసుకుందామా? 

1 /6

 Fenugreek Health Benefits: మెంతులు చేసే మేలు మరే ఇతర పదార్థం చేయదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే మెంతుల గింజల నుంచి ఆకుల వరకు అన్ని భాగాల్లోనూ ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే చాలామంది మెంతులు, అలాగే మెంతికూర రెండింటిలో ఎందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి అనే చర్చలేవదీస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మెంతి గింజలు, మెంతి ఆకులు రెండింటిలో ఏది ఎక్కువ ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  

2 /6

మెంతి గింజల్లో ఉండే పోషకాలు ఇవే: మెంతుల్లో విటమిన్ బి12, పొటాషియం అలాగే ఇతర మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెంతుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా అత్యధికంగా ఉంటుంది. మెంతులను నీళ్లలో నానబెట్టినట్లయితే, వాటిలోని ఫైబర్ మనకి మెత్తటి జెల్ రూపంలో కనిపిస్తుంది.

3 /6

మెంతులను ఎలా వాడాలి: మెంతుల్లో ఉండే ఈ జెల్ లాంటి పదార్థం ఫైబర్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది.  మెంతులను నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను తాగినట్లయితే అనేక పోషక పదార్థాలు లభిస్తాయి. అని ఇందులో సాల్యబుల్ ఫైబర్ ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ నీటిని తాగినట్లయితే మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో షుగర్ నిల్వలు పెరగకుండా కట్టడి చేస్తాయి.  

4 /6

మెంతి కూరలో ఉండే పోషకాలు ఇవే: ఇక మెంతులతో పాటు మెంతికూరలో కూడా అనేక పోషకాలు లభిస్తుంటాయి. మెంతికూరలో విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ అత్యంత అరుదైనది. సూర్యరష్మి లో తప్ప మరే ఇతర ఆహార పదార్థాల్లోనూ విటమిన్ డి లభించదు. అలాగే ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. పాల కన్నా కూడా ఎక్కువ కాల్షియం మెంతి ఆకుల్లోనే ఉందని డైటీషియన్లు చెబుతుంటారు. దీంతో పాటు ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది.  

5 /6

మెంతి ఆకుల్లో విటమిన్ B 6, థయామిన్ , ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లోవిన్. నియాసిన్ వంటి విటమిన్లు అలాగే ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ వంటి ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించేందుకు ఉపయోగపడతాయి

6 /6

డయాబెటిస్ పాలిట వరం మెంతి గింజలు: ఇక డయాబెటిస్ కు మెంతి గింజలు అనేవి ఒక వరం అనే చెప్పవచ్చు. శరీరంలో షుగర్ ను కంట్రోల్ చేసేందుకు మెంతుల్లోని ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మెంతులు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ గా పిలవబడే ఎల్ డి ఎల్ రక్తంలో తగ్గించేందుకు తోడ్పడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ వంటి జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇక పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు మెంతి గింజలు ఔషధంలా ఉపయోగపడతాయి. మెంతి గింజలు పాలిసిస్టిక్ ఓవర్సీన్ రూమ్ వంటి రుగ్మతల నుంచి విముక్తి కలిగిస్తాయి.