Fingerprint Island: భగవంతుడు ఈ ప్రపంచాన్ని చాలా అందంగా, ప్రత్యేకంగా తీర్చిదిద్డాడు. ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడిన అందమైన ప్రాంతాల్ని వీక్షించేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా చాలా ద్వీపాలున్నాయి. కానీ అచ్చం మనిషి వేలిముద్రలా ఉండే ద్వీపాన్ని ఎప్పుడూ ఎన్నడూ చూసుండరు. ఆ ద్వీపం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
ఈ ద్వీపాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఏరియల్ వ్యూ ఎంత యూనిక్‌గా ఉంటుందంటే క్రొయేషియా ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం యూనెస్కోను అభ్యర్ధించింది.
ఈ ద్వీపం సర్ఫేస్ ఏరియా కేవలం 0.14 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ ద్వీపం కోస్తాతీరం కేవలం 1.43 కిలోమీటర్లు మాత్రమే. అంటే కేవలం నడకమార్గం ద్వారా ఈ ద్వీపాన్ని చుట్టిరావచ్చు. విశేషమేంటంటే ఇక్కడెవరూ నివసించడం లేదు.
ఈ ఐల్యాండ్ ఓవెల్ ఆకారం అనేది సహజసిద్ధంగా వచ్చింది. ఫింగర్ ప్రింట్ వంటి ఆకారం ఎందుకంటే అక్కడి స్థానికులు తమ ఇళ్లు, పంటల్ని పెనుగాలుల్నించి కాపాడుకునేందుకు బలమైన గోడలు నిర్మించేవారు. అందుకే ఈ ద్వీపాన్ని పైనుంచి చూస్తే ఫింగర్ ప్రింట్లా కన్పిస్తుంది.
బాల్జెనాక్ ఐల్యాండ్ అనేది అడ్రియాటిక్ సముద్రంలోని సైబీనిక్ ఆర్కిపెలాగోలో ఓ భాగం. ఇది ఓవెల్ ఆకారంలో ఉంటుంది. స్పష్టంగా చూస్తే వేలిముద్ర ఆకారం. అందుకే దీనిని ఫింగర్ ప్రింట్ ఐల్యాండ్ అంటారు
యూరప్‌లోని క్రొయేషియా సముద్రతీరంలో ఉంది ఈ చిన్న ద్వీపం. ఈ ద్వీపం పేరు బాల్జెనాక్. ఈ ద్వీపాన్ని పైనుంచి అంటే ద్రోన్ లేదా హెలీకాప్టర్ నుంచి పరిశీలిస్తే అచ్చం వేలిముద్ర ఆకారంలో ఉంటుంది.