Signal app: సిగ్నల్ యాప్‌లో 6 అద్భుత ఫీచర్లు ఇవే..

  • Jan 11, 2021, 19:57 PM IST

 

Signal app: వాట్సప్ ఇటీవలే ప్రైవసీ పాలసీను అప్ డేట్ చేసింది. దాంతోపాటు మీ వ్యక్తిగత సమాచారం వాట్సప్ నుంచి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పోలుస్తూ  ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో చాలామంది యూజర్లు వాట్సప్ వదిలేసి కొత్త యాప్ సిగ్నల్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. సిగ్నల్ ఫీచర్లపై కాస్త అయోమయం ఉంది. అసలు సిగ్నల్ యాప్‌లో ఉన్న 6 అద్భుత ఫీచర్లు గురించి తెలుసుకుందాం..

1 /6

వాట్సప్ నుంచి ఆడియో లేదా వీడియో కాలింగ్ ఎలాగైతే చేస్తారో..అలాగే సిగ్నల్ కూడా మీకు కాలింగ్ సపోర్ట్ ఇస్తుంది. 

2 /6

మెస్సేజ్ టైప్ చేసే స్థానంలో మీరు ఆడియో మెస్సేజ్ కూడా పంపించవచ్చు

3 /6

మీరు కేవలం మొబైల్‌లోనే కాకుండా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ నుంచి కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు

4 /6

మీరు సిగ్నల్ యాప్‌లో ఫోటో , వీడియో ఫైల్ కూడా షేర్ చేయవచ్చు. ఇతర మెస్సేజింగ్ యాప్‌లానే సిగ్నల్‌లో కూడా అన్ని రకాల ఫైల్ ఫార్మెట్స్ సపోర్ట్ చేస్తాయి.

5 /6

వాట్సప్‌లానే మీరు సిగ్నల్ యాప్‌లో కూడా గ్రూప్స్ ఏర్పర్చుకోవచ్చు. పాపులర్ మెస్సేజింగ్ యాప్‌లానే సిగ్నల్‌లో కూడా చాలామందిని అడ్మిన్ చేయవచ్చు. అంతేకాకుండా..గ్రూప్ ఇన్‌ఫో కూడా ఎడిట్ చేయవచ్చు

6 /6

ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సప్‌లానే సిగ్నల్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యముంది. అంటే మెస్సేజ్ సెండర్ మరియు రిసీవర్ తప్ప మరెవరూ చదవలేరు.