FD Interest Rate: రిటైర్ అయిన తరువాత చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో డబ్బులు దాచుకుంటుంటారు. ఎందుకంటే వీటిని సురక్షితంగా భావిస్తారు. సీనియర్ సిటిజన్లకు ఒక్కో బ్యాంకు ఒక్కో విధమైన వడ్డీ రేటు అందిస్తోంది. అన్నింటికంటే ఎక్కువగా ఏ బ్యాంకు వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం..
ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఎఫ్‌డిపై 7.25 శాతం వడ్డీ అందిస్తోంది.
కెనరా బ్యాంకు సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఎఫ్‌డిపై 7.30 శాతం వడ్డీ ఇస్తోంది. అంటే మెచ్యూరిటీ పూర్తయితే 1 లక్ష రూపాయలకు 1.24 లక్షలు చేతికి అందుతాయి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులు మూడేళ్ల ఎఫ్‌డిపై 7.50 శాతం వడ్డీ ఇస్తున్నాయి.
యాక్సిస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఎఫ్డీపై 7.60 శాతం వడ్డీ అందిస్తోంది. అంటే 1 లక్ష రూపాయలు ఎఫ్డీ చేస్తే మూడేళ్ల తరువాత అది 1.25 లక్షలవుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా మూడేళ్ల ఎఫ్డీపై 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు అన్నింటికంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నది ఇదే. అంటే 1 లక్ష రూపాయలు ఎఫ్డి చేస్తే మూడేళ్లకు 1.26 లక్షలు చేతికి అందుతుంది.