Foods For Arteries:  రక్త నాళాలను శుభ్రపరిచే అద్భుతమైన పదార్థాలు ఏంటో మీకు తెలుసా?

Foods For Clogged Arteries: రక్తనాళాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే రక్తనాళాలను శుభ్రపరిచే పదార్థాలు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.

Foods For Clogged Arteries: రక్తనాళాలు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన రవాణా వ్యవస్థ. ఇవి ఆహారం, ఆక్సిజన్‌ను కణాలకు చేర్చి, వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకువెళతాయి. ఈ రక్తనాళాలు కొవ్వు, కొలెస్ట్రాల్ వంటి పదార్థాలతో అడ్డుపడితే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే ఆరోగ్య కరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఏలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. 
 

1 /9

పండ్లు, కూరగాయలు: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు (ఆపిల్, బెర్రీలు, బ్రోకలీ, కాలీఫ్లవర్) రక్తనాళాలను శుభ్రపరిచి, గుండెకి మేలు చేస్తాయి.  

2 /9

బ్రౌన్ రైస్: ఫైబర్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.  

3 /9

బాదం, అక్రోట్లు: మంచి కొవ్వులు అధికంగా ఉండే ఈ గింజలు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  

4 /9

పసుపు: యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన పసుపు రక్తనాళాల వాపును తగ్గిస్తుంది.  

5 /9

వెల్లుల్లి: రక్తం గడ్డకట్టకుండా నిరోధించి, రక్తనాళాలను శుభ్రపరుస్తుంది.  

6 /9

వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  

7 /9

ధ్యానం: ఒత్తిడిని తగ్గించడం ద్వారా రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.  

8 /9

వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల మందులు రక్తనాళాలను శుభ్రపరిచేందుకు ఉపయోగపడతాయి.  

9 /9

ముగింపు: రక్తనాళాల ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యానికి ప్రతిబింబం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించడం వల్ల మనం రక్తనాళాలను శుభ్రపరచి, ఆరోగ్యంగా ఉండవచ్చు