Actress begging on street: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యం. కటిక పేదరికంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎంతోమంది, ఆ తర్వాత వేలకోట్ల రూపాయలను పోగుచేసుకొని నేడు సుసంపన్న సెలబ్రిటీలుగా కొనసాగుతుంటే.. మరికొంతమంది వచ్చిన డబ్బును వృధాగా ఖర్చులు చేసి చివరికి తినడానికి కూడా తిండి లేకుండా ఎన్నో అవస్థలు పడుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత బిచ్చగాళ్లు గా మారిన నటీనటులు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టిన ఈమె .. దానధర్మాలు చేసి చివరికి చితి కాల్చడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఆమె మరణించారు.
ఇకపోతే ఒక టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ పరిస్థితి ఎక్కువే అని చెప్పాలి. సాధారణంగా ముంబైలో సెలబ్రిటీగా మారాలి అంటే గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు అందుకు తగ్గట్టుగా అదృష్టం కూడా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ విజయం కోసం వచ్చి పరాజయం పాలైన వారు కూడా ఉన్నారు. ఇకపోతే ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు దీనస్థితికి చేరి.. వీధిన పడి భిక్షాటన చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు మిథాలీ శర్మ.
ముంబైలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన మిథాలీ శర్మ కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత మోడలింగ్ చేసింది. చాలా నెలలుగా మంచి ఆఫర్లు రాకపోవడంతో వచ్చిన సినిమాలతోనే సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో డబ్బు కొరత ఏర్పడింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు భోజ్ పురి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న మిథాలీ శర్మ నిర్మాతల మొదటి ఎంపిక కూడా.
అలాంటి ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా పరాజయం పాలవడం ప్రారంభించాయి. అక్కడినుంచి దర్శక నిర్మాతలు కూడా ఈమెను దూరం పెట్టారు. ఇక అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె ముంబైలోని లోఖండ్ వాలా వీధుల్లో భిక్షాటన చేయడం ప్రారంభించింది.
అంతేకాదు ముంబై వీధుల్లో మిథాలీ శర్మ దొంగతనం చేస్తూ పట్టుబడిన సందర్భం కూడా ఉంది. అదే రోజు ఆమెను పోలీసులు అరెస్టు కూడా చేశారు. మహిళా పోలీసులు ఆమె చేతికి సంకెళ్లు వేయడానికి ప్రయత్నించగా ఆమె వారితో వాగ్వాదానికి దిగి ఆ తర్వాత పారిపోయే ప్రయత్నం చేసింది. ఇక ఆమె మానసిక పరిస్థితి విషమించడంతో మెంటల్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.