Amrapali: శివాలెత్తిన ఆమ్రాపాలీ.. వారిపై చర్యలకు ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?

Hyderabad news: జీహెచ్ఎంసీ కమిషనర్ కాటఆమ్రాపాలీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పలు చోట్ల మాల్స్ , థియేటర్లలో పార్కింగ్ ఫీజుల విషయంలో జీహెఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

1 /6

హైదరాబాద్ లో పలు చోట్ల మల్టీ ప్లెక్స్, థియేటర్లు మరికొన్ని చోట్ల నిబంధలనకు విరుద్దంగా పార్కింగ్ ఫీజ్ ను వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే నిబంధలనలను అతిక్రమించిన వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

2 /6

ప్రస్తుతం హైదరాబాద్ లో బల్దియా కమిషనర్ గా  బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆమ్రాపాలీ తనదైన మార్కు చూపిస్తున్నారు. జీహెచ్ఎంసీల పరిధిలో ఒక వైపు ప్రజలు సమస్యలపై దృష్టిసారిస్తూ.. మరోవైపు నిబంధలను అతిక్రమించిన వారిపై కోరడా కూడా ఝుళిపిస్తున్నారు. 

3 /6

ఈనేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరంమంతాట.. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సర్వే నడుస్తుంది. దీనిలో భాగంగా.. అధికారులు నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, భవన నిర్మాణ అనుమతులు మొదలైన వాటిని తనిఖీలు చేస్తున్నారు.ప్రజలు కూడా అధికారులకు సహాకరిస్తున్నారు.    

4 /6

ఇటీవల ఈ వ్యవహరంలో కూడా ఆమ్రాపాలీ వ్యక్తిగత వివరాలు, ఆధార్ కార్డు వంటివి చెప్పాల్సిన అవసరంలేదంటూ కూడా తెల్చిచెప్పారు. ఎవరైన అడిగిన కూడా చెప్పొందంటూ సూచించారు. ఇదిలా ఉండగా.. కొందరు ప్రజలు.. మాల్స్ లు, ఫుడ్ స్టాల్స్ లలో క్వాలిటీ లేని ఫుడ్ అందిస్తున్నారంటూ కూడా ఆమ్రాపాలీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది..

5 /6

దీంతో రంగంలోకి దిగిన అధికారులు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. దీనిలో మల్టీ ప్లెక్స్, ఫుడ్ స్టాల్స్ లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆమ్రాపాలీ కఠిన చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.  

6 /6

మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు, పెద్ద  షాపింగ్ మాల్స్‌లో మొదటి అరగంట ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో..క్షేత్రస్థాయిలో సందర్శిస్తు.. ప్రజల సమస్యల్ని ఆమ్రాపాలీ తెలుసుకుంటున్నారు.  ప్రస్తుతం అధికారులు చేపట్టిన జీఐఎస్ సర్వే పూర్తికాగానే.. యుటిలిటీ మ్యాపింగ్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.