Girlfriend on Rent: సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతుంటే తల్లిదండ్రులు మందలిస్తుంటారు. కానీ అక్కడలా కాదు. గర్ల్‌ఫ్రెండ్స్ లేరనే కారణంతో పిలల్ని తిడుతుంటారు. చైనాలో ఇలానే జరుగుతుంది. తల్లిదండ్రుల మందలింపులు, తిట్లు తప్పించుకునేందుకు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎరేంజ్ చేసుకుని తల్లిదండ్రులతో కల్పిస్తుంటారు. ఈ విధమైన వెసులుబాటు కోసం చైనాలో యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌లా నటించే అమ్మాయిలు మాత్రం ఇది చాలా కష్టమైన పనిగా చెబుతున్నారు. ప్రతిసారీ అపరిచిత వ్యక్తులతో గర్ల్‌ఫ్రెండ్‌లా నటించాల్సి రావడం కష్టమైన పని అంటున్నారు.
చైనాలో లూనార్ న్యూ ఇయర్ నాడు మాత్రం గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. ఆ సమయంలో గర్ల్ ఫ్రెండ్‌ను హైర్ చేసేందుకు 34 వేల 241 రూపాయల నుంచి 1 లక్షా 14 వేల వరకూ ఖర్చు కాగలదు. ఎందుకంటే న్యూ ఇయర్ నాడు ఎక్కువమంది సెలవులపై ఇంటికి వెళ్తుంటారు.
అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకునేందుకు చైనా యువకులు దాదాపు 22 వేల 816 రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆమెతో డేట్‌కు వెళ్లవచ్చు. ఇంటికి తీసుకెళ్లవచ్చు. చాటింగ్ కూడా చేయవచ్చు.
అద్దెకు గర్ల్‌ఫ్రెండ్ సెట్ చేసుకోవాలంటే షరతులుంటాయి. గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకునే వ్యక్తి ఆ అమ్మాయిని కనీసం ముట్టుకోకూడదు. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి..ఎమోషనల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తుంది. గర్ల్‌ఫ్రెండ్‌లా జీవిస్తుంది కూడా.
అత్యధిక శాతం చైనా యువత సెలవులకు ఇంటికెళ్లేటప్పుడు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకుని వెళ్తుంటారు. లేకపోతే తల్లిదండ్రుల్నించి, బంధువుల్నించి ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంటుంది. చాలా సందర్బాల్లో పెళ్లిళ్లు, గర్ల్‌ఫ్రెండ్ వ్యవహారంలో బంధువుల్నించి అభ్యంతరాలు కూడా ఎదుర్కొంటుంటారు చైనా యువకులు.