World Dangerous Places: ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్ని చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. అత్యంత భయం గొలిపే ప్రాంతాలు కూడా ఇవే ప్రపంచంలో. ఇందులో కొన్ని భూమ్మీద ఉన్న అతి భయంకర ప్రాంతాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
భూమ్మీద ఉన్న అతి భయంకర, ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ అత్యంత విషపూరిత పాములు లెక్కకు మించి ఉంటాయి. పాములు ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉండేది ఇక్కడే.
ఇక్కడున్న దర్వాజా గ్యాస్ క్రేటర్ భూమిపై ఉన్న ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటి. ఈ ప్రాంతాన్ని సందర్శించడమంటే నిజంగా రిస్క్‌తో కూడుకున్నదే.
ఫ్రెంచ్ పాలినేషియాలో ఉన్న ఈ ప్రాంతంలో కెరటాలు అతి భయంకరంగా ఉంటాయి. ప్రపంచంలోనే అతి భయంకర కెరటాలుగా పిలుస్తారు. 21 అడుగుల ఎత్తువరకూ ఎగసి పడుతుంటాయి ఈ కెరటాలు.
చైనాలోని మౌంట్ హువా ప్రాంతమిది. ఇది ప్రపంచంలో అన్నింటికంటే భయంకరమైన ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి. ఎత్తైన ప్రదేశాలంటే భయమున్నవాళ్లు ఇక్కడికి అస్సలు వెళ్లకూడదు. ఇక్కడ ప్లాంక్ వాక్ అనేది అత్యంత భయం గొలిపే అనుభూతినిస్తుంది.
ఇది పూర్తిగా సజీవమైన లావాతో నిండిన సరస్సు. సాహసాలు చేసేవారికి డైకింగ్ డెస్టినేషన్ లాంటింది. ఈ ప్రదేశంలో యాక్టివ్ క్రేటర్‌తో హెలీకాప్టర్ నుంచి బంగీ జంప్ చేయడం ఒళ్లు జలదరించే ఫీట్. చిలీలో ఉంది ఈ ప్రాంతం.