Gold-Silver Rate Today: పెరుగుతూనే ఉన్న బంగారం ధర..నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగిందో తెలుసుకోండి..!!

Gold Price in Hyderabad: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు నాలుగు రోజులు పసిడి ధరలు పెరుగుతున్నాయి. నేడు సోమవారం బంగారం ధరల్లో మార్పు కనిపించింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయ కారణాలు  ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 5, సోమవారం నేడు బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 
 

1 /5

Gold Price in Hyderabad:  బంగారం ధరలు ఊహించిన దానికన్నా వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీ సోమవారం బంగారం ధరలలో మళ్లీ మార్పు వచ్చింది. ఇప్పటికే బంగారం ధర 70 వేల రూపాయలు దాటడం గమనార్హం. ఇదే బాటలో వెండి కూడా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,700 గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,810గా ఉంది. ప్యూర్ గోల్డ్ ధర రూ.70 వేల మార్క్ చేరింది.  

2 /5

బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయ కారణాలు స్పష్టంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  అంతర్జాతీయంగా కామెక్స్ సూచీలో ఒక ఔన్స్ ( సుమారు 31 గ్రాములు) బంగారం ధర 2400 డాలర్లు దాటింది.  ఇప్పుడు ఈ ట్రెండ్ కొనసాగుతోంది.  దీని ప్రభావం కచ్చితంగా దేశీయ మార్కెట్లపై కూడా కనిపిస్తుంది.  ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. 

3 /5

బంగారం ధరలు గత నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భారీగా తగ్గుముఖం పడ్డాయి.  బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో పసిడి ధరలు నేల మార్గం పట్టాయి.  కేవలం ఒకే రోజులో సుమారు నాలుగువేల రూపాయల వరకు బంగారం ధర తగ్గింది అంటే మీరు ఏ రేంజ్ లో కరెక్షన్ కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి.   

4 /5

 అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కీలక వడ్డీరేట్లను స్థిరంగా ఉంచడమే ప్రధాన కారణమని బులియన్ పండితులు చెబుతున్నారు. ప్రధానంగా బంగారం ధరలు భారీగా పెరగడం గడిచిన మూడు రోజులుగా కొనసాగుతోంది. ఈనెల ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు రూ. 71 వేల రేంజు సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి.  అయితే పసిడి ధరలు భవిష్యత్తులో ఏ రేంజ్ లో పెరుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తద్వారా మీరు ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా లేదా తెలుసుకోవచ్చు. 

5 /5

 బంగారం ధరలు శ్రావణమాసంలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు  ఆర్బీఐ వడ్డీరేట్లు స్థిరంగానే ఉంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ వార్త కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఒక సురక్షితమైన స్వర్గధామంగా చెబుతుంటారు. స్టాక్ మార్కెట్లు, అదే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థలు  పతనం అవుతున్న సమయంలో  ఇన్వెస్టర్లు  బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు బంగారం అనేది ఒక సురక్షితమైన స్థానంగా భావిస్తారు.