Gongura Pachadi: రెండు నిముషాల్లోనే ఆంధ్రస్టైల్ గోంగూర పచ్చడి.. ఇలా చేస్తే యమ్మీ.. యమ్మీ‌గా..సూపర్ టెస్ట్..

Gongura pachadi process: చాలా మంది గోంగూర పచ్చడి అంటే పడిచస్తుంటారు. అయితే.. గోంగుర పచ్చడిని కేవలం రెండు నిముషాల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 /6

ఆంధ్రలో గోంగుర పచ్చడి ఫుల్ ఫెమస్. అక్కడ చాలా మంది అన్నంతోపాటు, చట్నీలు ఎక్కువగా తింటుంటారు. ఇంకా  గొంగుర చట్నీ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. దీన్ని టెస్టీగా ఇలా చేయోచ్చు.

2 /6

మొదటగా మార్కెట్ నుంచి గోంగురను తెచ్చుకొవాలి. దాన్ని కట్ చేసుకుని ఒక బౌల్ లో పెట్టుకొవాలి. గోరు వెచ్చని నీళ్లతో గోంగుర ఆకుల్ని శుభ్రంగా కడిగేసుకొవాలి . ఆతర్వాత గోంగుర ఆకుల్ని ఒక గిన్నెలో వేసుకొవాలి.

3 /6

మరొవైపు కడాయ్ లో నూనె రెండు స్పూన్ ల నూనె వేయాలి. దానిలో  ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేయాలి. ఆ తర్వాత ఈ నూనె చల్లారే వరకు చూడాలి.గోంగుర ఉన్న ఆకుల మీద.. పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లీ పెస్టు, మసాల పొడిలు వేసుకొవాలి..

4 /6

ఈ మిశ్రమాన్ని ఒక గ్రైండర్ లో వేయాలి.  ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసీ..మిక్సీ ఆన్ చేయాలి. ఆ మిశ్రమం అంతా పేస్ట్ లాగా మారిపోతుంది. అప్పుడు మళ్లీ ఉప్పు వేసుకొవాలి. ఆ తర్వాత మళ్లీ ఒకసారి మిక్సర్ ఆన్ చేసి, పూర్తిగా చట్నీ మిక్స్ అయిపోయాక కిందకు దించి మరో గిన్నెలో ఆ చట్నీను తీసుకొవాలి.

5 /6

ఈ విధంగా చట్నీను తీసుకున్న తర్వాత.. దాని మీద అప్పటికే రెడీగా ఉన్న కడాయ్ లోని నూనెను వేయాలి. ఆ తర్వాత మళ్లీ చట్నీను అన్ని వైపులా కలిసే విధంగా కలపాలి. ఇంకేముంది.. ఐదు నిముషాల్లోనే ఘుమ ఘుమలాడే టెస్టీ చట్నీ రెడీ అయిపోయినట్లే.

6 /6

ఈ చట్నీని అన్నంతో కానీ, చపాతీలతో కానీ, లేదా పూరీలతో తింటే అదిరిపోయే టెస్ట్ వస్తుంది. ఇది చేసుకొవడం కూడా చాలా ఈజీ. అందుకే చాలా మంది గొంగుర చట్నీని చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)