UMID Card: రైల్వే ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈ రూ. 100 కార్డుతో నేరుగా ఎయిమ్స్‌లో చికిత్స..!

Railway UMID Card: భారతీయ రైల్వే ఒక కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షన్లు, డిపెండెంట్స్‌ హెల్త్‌ కేర్‌ పాలసీలో  సమూలమైన మార్పులు చేపట్టింది. ఇండియన్‌ రైల్వే తమ ఉద్యోగులకు యూనిక్‌ మెడికల్‌ ఐడెంటిఫికేషన్‌ (UMID) కార్డులను మంజూరు చేయనుంది. 
 

1 /5

ఇది పనిచేస్తున్న ఉద్యోగి, పింఛను దారులు, వారి కుటుంబ సభ్యులకు కూడా అందించనుంది. దీంతో వారు రైల్వే ప్యానెల్‌తోపాటు ఏయిమ్స్‌ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ లో కూడా చికిత్స పొందవచ్చు. ఈ కార్డును రూ.100 ఇవ్వనున్నారు. ఇది దాదపు 12.5 లక్షల ఉద్యోగులకు లాభాదాయకం. అదేవిధంగా 15 లక్షల పింఛనుదారులకు, రూ. 10 లక్షల మంది కుటుంబ సభ్యులు కూడా లబ్దిపొందనున్నారు.  

2 /5

రైల్వే ఉద్యోగుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల తర్వాత ఈ కార్డును ప్రారంభించనుంది. ముఖ్యంగా వారి ఫిర్యాదులో వైద్యులు కేవలం వారికి ఇష్టం వచ్చిన ఆస్పత్రులకే రిఫర్‌ చేస్తున్నారనే అనేక మంది ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ కొత్త పాలసీ విధానంలో ఆ సమస్య ఉండదు.   

3 /5

ఏ డాక్టర్‌ రిఫరెన్స్‌ లేకుండా మెడికల్‌ సదుపాయాలు ఉద్యోగులు పొందనున్నారు. ముఖ్యంగా చంఢిగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌, జేఐపీఎంఈఆర్‌ పుదుచ్చేరీ, ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌ బెంగళూరు, ఇంకా మన దేశలోని 25 ఎయిమ్స్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్యం సులభంగా పొందవచ్చు. ఈ కార్డు ద్వారా కేవలం వైద్యం మాత్రమే కాదు మందులు కూడా పొందుతారు.   

4 /5

రైల్వే బోర్డు ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ (ట్రాన్సఫర్మెషన్‌) ప్రణవ్‌ కుమార్‌ మాలిక్‌ సోమవారం ఈ యూనిక్‌ మెడికల ఐడెంటిఫికేషన్‌ కార్డు గురించి మాట్లాడుతూ ఈ కార్డు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ కార్డును హెల్త్‌ మేనేజ్మెంట్‌ ఇన్ఫర్మెషన్‌ సిస్టం (HMIS) ద్వారా డిజీలాకర్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇది ఉద్యోగులు, పింఛనుదారుల ప్రొఫైల్‌ లో కూడా అందుబాటులో ఉంచనున్నారు.   

5 /5

ఈ కార్డు ద్వారా రైల్వే ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబసభ్యులు కూడా రైల్వే ప్యానెల్‌లో అందుబాటులో ఉన్న హాస్పిటల్‌ లేదా డయాగ్నస్టిక్‌ సెంటర్లలో చికిత్స పొందవచ్చు. ఈ కార్డును జనరల్‌, ఎమర్జెన్సీ చికిత్స కూడా పొందవచ్చు. UMID కార్డు లేనివారు ఆ నంబర్‌  ఉంటే కూడా చికిత్స పొందవచ్చు.    

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x