New India Co-op Bank: కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బిఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు బ్యాంకు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.
Gold: భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తోంది. ప్రజలు బంగారం కొని ఇంట్లో దాచుకుంటారు. అయితే ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసా. పరిమితికి మంచి బంగారం ఉంచితే ఏమౌతుందో తెలుసా. బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kotak Mahindra Bank: దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒక్కటైన కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఊరట లభించింది. గత ఏడాది విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడం మరింత సులభం కానుంది. ఆ వివరాలను తెలుసుకుందాం.
Gold Rate Today:ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు గురువారం వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. దేశ రాజధానిలో బంగారం ధర 10 గ్రాములకు రూ.340 తగ్గి రూ.87,960కి చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం 10 గ్రాములకు రూ.88,300 వద్ద ముగిసింది.
EPFO: ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఈఎల్ఐ స్కీమ్ ద్వారా నెల జీతం ఫ్రీగా పొందవచ్చు. ఇందుకు యూఏఎన్ యాక్టివేషన్ గడువును మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకే అవకాశం ఉంటుందని తెలిపింది. మరి వెంటనే మీ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోండి.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా గత 5 సెషన్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. మంగళవారం ఇంట్రా డే సెషన్ లో సెన్సెక్స్ 1200పాయింట్లు నష్టపోయింది. 77,000కంటే తక్కువ స్థాయికి చేరింది. నిఫ్టీ 50 కీలకమైన 23,000కన్నా దిగువకు చేరుకుంది.
Stock Market: ట్రేడింగ్ వారంలో రెండవ రోజు భారత స్టాక్ మార్కెట్ రెడ్ జోన్లో ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 73.18 పాయింట్ల లాభంతో 77,384.98 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 ఇండెక్స్ కేవలం 1.95 పాయింట్ల లాభంతో 23,383.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సోమవారం మార్కెట్ రెడ్ మార్కులో ట్రేడింగ్ ప్రారంభించి భారీ క్షీణతతో ముగిసింది.
Vijay Mallya: విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కంటే ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకొన్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ. 6,200కోట్లు బాకీ ఉన్నానని..తన నుంచి రూ. 10,200కోట్లు బ్యాంకులు రాబట్టుకొన్నాయని తెలిపారు. విజయ్ మాల్యా నుంచి రూ.14 వేల కోట్లు రికవరీ చేసినట్లు పార్లమెంటులో కూడా సమాచారం అందించినట్లు విజయ్ మాల్యా న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు బ్యాంకుల నుండి ఈ సమాధానం కోరింది.
Avoid using Chat Deepseek: అధికారిక ప్రయోజనాల కోసం ChatGPT, DeepSeek లను ఉపయోగించడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిషేధించింది.అధికారిక ప్రయోజనాల కోసం ChatGPT, DeepSeek వంటి AI సాధనాలను ఉపయోగించకుండా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులను కోరింది.
New Income Tax Rates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. కొత్త పన్ను విధానం ప్రకారం..వార్షిక ఆదాయం రూ. 12లక్షల వరకు పన్ను ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ కొత్త పన్ను శ్లాబులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తులం లక్ష రూపాయలు కావడం ఖాయమనిపిస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,640గా ఉంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 050పలుకుతోంది. బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్నాయి.
Gold Rate Today: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. బంగారం ధర ఏకంగా 86వేలు దాటేసింది. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. ప్రధానంగా బంగారం ధర హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు స్థాయిని తాకడంతో బంగారం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రూపాయి విలువకూడా పతనమైంది.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాల్లోనే ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన మార్కెట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇవాళ సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల వరకు కోల్పోయింది. దలాల్ స్ట్రీట్ పై ప్రభావం చూపిన అంశాలను ఓసారి తెలుసుకుందాం.
Nirmala Sitharaman Sarees Significance: బడ్జెట్ సమర్పించేందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ 8వ సారి ప్రవేశపెట్టారు. బడ్జెట్ తోపాటు ఆరోజు కట్టుకునే చీర కూడా ఎంతో చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో నిర్మలమ్మ బడ్జెట్ సమర్పించేటప్పుడు ఎలాంటి చీరలను ధరించారో చూద్దాం.
Budget 2025: 2025లో సమర్పించిన బడ్జెట్ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్ గా నిలుస్తుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె గ్రూపు దాదాపు రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
Budget 2025-26: వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ లో పతనమవుతున్న ఆర్థక వృద్ధి రేటు, అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్ లో పెరుగుదల వంటి పలు సవాళ్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిష్కరించాల్సి ఉంటుంది. వీటిలోపాటు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో నిర్మలమ్మ ముందున్న సవాళ్లే ఏంటో చూద్దాం.
Budget Day Stock Market: సాధారణంగా భారత స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వారంలో 5 రోజులు మాత్రమే ట్రెడింగ్ సాగిస్తుంటాయి. వీటితోపాటు పబ్లిక్ హాలిడేస్ , ప్రత్యేక సందర్భాల్లో కూడా సెన్సెక్స్, నిఫ్టీ మూసివేసి ఉంటాయి. మరి ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ రోజు శనివారం కావడంతో బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. కొత్త సంవత్సరం తొలి నెలలోనే భారీగా పెరిగింది. ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. క్రితం ట్రేడింగ్ రోజున కిలో వెండి ధర రూ.92,000 నుంచి రూ.1,000 పెరిగి రూ.93,000కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా, కమోడిటీ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ఔన్సుకు $2,794.70 వద్ద స్థిరంగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.