Stress: ఒత్తిడితో నష్టాలే కాదు లాభాలు కూడా.. ఎలా అంటే..?

Stress Secrets: గజిబిజి లైఫ్ స్టైల్ కారణంగా ప్రతి ఒక్కరిలో ఒత్తిడి అధికమవుతుంది. అది పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఇలా ఏదైనా కారణం కావచ్చు కానీ ఈ ఒత్తిడి కారణంగా మనిషి మానసికంగా,  శారీరకంగా కూడా కృంగిపోతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవాలని , అలా చేస్తేనే ఎక్కువ కాలం ఆయురారోగ్యాలతో ఆయుష్షుతో జీవిస్తారని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.

1 /5

అయితే ఈ ఒత్తిడి సాధ్యమైనంత వరకు నష్టాలే మిగుల్చుతుంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం,  ఈ ఒత్తిడి వల్ల నష్టాలే కాదు లాభాలు కూడా ఉన్నాయట. ఒత్తిడి వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా?  మరి ఆ ఒత్తిడి వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 

2 /5

సుదీర్ఘకాలం పాటు ఉండే ఒత్తిడి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. కానీ అప్పుడప్పుడు కలిగే పరిమిత స్థాయి ఒత్తిడి ప్రయోజనాలను కలిగిస్తుందట. శాస్త్ర పరిభాషలో.. ఈ తరహా ఒత్తిడిని యూస్ట్రెస్  అని అంటారు. ఇది శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందట. కష్టమైన పనులు చేసేటప్పుడు ఇతర ఒత్తిడి కలుగుతుందని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వెల్లడించింది. ముఖ్యంగా ఈ తరహా ఒత్తిడి వల్ల  శరీరంలో కలిగే ప్రతిస్పందనలు ఆందోళన కుంగుబాటును ఎదుర్కోవడంలో సహాయపడతాయి. 

3 /5

తక్కువ స్థాయి ఒత్తిడితో మెదడు ఉత్తేజితమై న్యూట్రోసీన్స్ అనే కెమికల్స్ విడుదల అవుతాయట. ఇవి నాడీ కణాల మధ్య అనుసంధానతను పెంచి ఏకాగ్రత ఉత్పాదకతను మెరుగుపరుస్తాయని సమాచారం. 

4 /5

స్వల్ప ఒత్తిడి కారణంగా మనలో రోగనిరోధక శక్తి మరింత బలోపేతం అవుతుంది. ఇలాంటి ఒత్తిడి వల్ల భవిష్యత్తులో కూడా మరెన్నో సవాళ్ళను ఎదుర్కొని మానసిక శారీరక సామర్థ్యాలను కలిగి ఉంటాం. అంతేకాదు ఈ ఒత్తిడి వల్ల విజయం సాధించాలనే పట్టుదల మనలో పెరుగుతుందట. పరిస్థితులకు అనుగుణంగా మారిపోయి ఉత్పాదకత పెంచడానికి తోడ్పడుతుందని సమాచారం. 

5 /5

గర్భిణీ స్త్రీలు కూడా ఇలాంటి ఒత్తిడిని అనుభవిస్తారు.  ఇలా ఒత్తిడి అనుభవించినప్పుడు.. బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఒత్తిడి ఏదైనా సరే మంచి ఒత్తిడి , చెడు ఒత్తిడి మధ్య తేడాను తెలుసుకోవడం అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. రోజంతా ప్రతికూల ఆలోచనలు ఆందోళనతో గడిపేవారు కచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉండడం గమనార్హం.