Google Maps: ఇటీవలి కాలంలో ఎక్కడికెళ్లాలన్నా ఒకటే ఆధారం..గూగుల్ మ్యాప్. తెలియని ప్రదేశాల్లో, కొత్త ఊర్లలో ఎక్కడికి వెళ్లాలన్నా క్షణాల్లో రూట్ మ్యాప్ చూపించేస్తుంది. ఇప్పుడిదే గూగుల్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ మిమ్మల్ని దారి తప్పనివ్వదు.
Google Maps: చాలామందికి గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఈ ఫీచర్ గురించి తెలియదు. అయితే చాలా బెస్ట్ ఫీచర్ అయినందున తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిక్కుల్లో పడకుండా కాపాడుతుంది.
ఇది డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఆఫ్‌లైన్ ఉన్నా సరే వినియోగించవచ్చు. దీని ఆధారంగా ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది.
ఈ ఫీచర్ వినియోగించాలంటే గూగుప్ మ్యాప్స్ సెర్చ్ బార్‌లో ఓకే మ్యాప్స్ అని టైప్ చేయాలి. ఆ తరువాత మీ ముందు మ్యాప్ డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది.
నెట్‌వర్క్ కవరేజ్‌లో లేకపోయినా ఇంటర్నెట్ డేటా అయిపోయినా ఈ ఫీచర్ ఆధారంగా లొకేషన్‌కు చేరుకోవచ్చు.
గూగుల్ మ్యాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ఆదారంగా ఇంటర్నెట్ అయిపోయినా సరే లొకేషన్‌కు ఏ అంతరాయం లేకుండా చేరుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో వచ్చాక ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ వినియోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా చాలా సులభంగా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వెళ్లిపోగలుగుతున్నారు. అయితే ఇంటర్నెట్ అయిపోతే గూగుల్ మ్యాప్స్ పనిచేయదు. మధ్యదారిలో ఎక్కడైనా చిక్కుకుపోవచ్చు. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ అందుబాటులో వచ్చింది.