Guarantee Weight Loss Plan: ఈ ప్లాన్ తూచా తప్పకుండా ఫాలో ఆయితే 3 వారాల్లో 7 కిలోలు తగ్గడం గ్యారంటీ

Weight Loss in 3 Weeks: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వంటి కారణాలతో బరువు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గించేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.

Weight Loss in 3 Weeks: మీరు కూడా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ప్రత్యేకమైన డైట్ ప్లాన్ ఉంది మీ కోసం. ఈ డైట్ ప్లాన్ కచ్చితంగా అమలు చేస్తే కేవలం మూడు వారాల్లో అంటే 21 రోజుల్లో 7 కిలోలు బరువు తగ్గవచ్చు.

1 /7

వ్యాయామం ఈ డైట్ ప్లాన్ తూచా తప్పకుండా పాటిస్తే చాలా సులభంగా 3 వారాల్లో 7 కిలోల బరువు తగ్గవచ్చు. అయితే రోజూ కాస్త వ్యాయామం లేదా వాకింగ్ కూడా చేయాలి

2 /7

డిన్నర్‌లో ఏం తినాలి డిన్నర్ సాయంత్రం 6 గంటల వరకూ పూర్తి కావాలి. ఇందులో ఇడ్లీ, జొన్న దోశె, మిక్స్డ్ కూరగాయలు, పన్నీర్ భుర్జీ, రోటీ, శాండ్విచ్ తీసుకోవచ్చు

3 /7

ఈవెనింగ్ స్నాక్స్ ఏం తినాలి సాయంత్రం స్నాక్స్ 3 నుంచి 4 గంటల మద్యలో తీసుకోవాలి. స్నాక్స్ రూపంలో ఫ్రైడ్ సోయా చంక్, ఉప్మా, రోస్టెడ్ మఖనా, రోస్టెడ్ శెనగలు, పాప్కార్న్, బేక్డ్ చిప్స్ తినవచ్చు. 

4 /7

లంచ్‌లో ఏం తినాలి లంచ్ ఎప్పుడూ మద్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఉండాలి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండేట్టు చూసుకోవాలి. కొద్దిగా అన్నం, పప్పు, ఆకు కూరలు తీసుకోవచ్చు. దాంతో పాటు గ్రీక్ యోగర్ట్, క్వినోవా, బీట్‌రూట్ సలాడ్ తినాలి

5 /7

బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలి ఉదయం 10 గంటకు పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. దీంతోపాటు ఏదైనా తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. ఇందులో స్వీట్ లేకుండా చూసుకోవాలి. అది ఫ్రైడ్ రూపంలో ఉండకూడదు. ఇందులో దలియా, ఓట్స్, స్ప్రౌట్స్ ఉంటే మంచిది

6 /7

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తిండి Intermittent Fasting విధానంలో 15-16 గంటలు ఫాస్టింగ్ ఉండాలి. మీరు ఏం తినాలన్నాఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తినాల్సి ఉంటుంది. 

7 /7

ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గించేందుకు Intermittent Fasting మంచి పద్ధతి. ఈ పద్థతి పాటించడం ద్వారా చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఆహారపు అలవాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రత్యేక డైట్ తీసుకోవాలి.