Hair fall: రాలే జుట్టు ప్రస్తుత రోజుల్లో ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చిట్కా పద్ధతులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన పండ్లతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
మారుతున్న కాలంతో పాటు ఒక్కోసారి మీ జుట్టు రాలిపోతుంటుంది. హెయిర్ ఫాల్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఒకవేళ మీ జుట్టు కూడా త్వరగా రాలుతుంటే..ఈ పండ్లతో చిట్కా పద్ధతుల్ని అవలంభిస్తే..మీరా సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. జాంపండు తింటే ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండులో విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది. ఈ పండుతో కోలోజన్ ఉత్పత్తి పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య నుంచి కోలోజన్ కాపాడుతుంది. మీ జుట్టుకు బలాన్ని కూడా ఇస్తుంది.
చాలా ఎక్కువ అద్భుత గుణాలు కలిగిన పండు స్ట్రా బెర్రీ. మీ ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. రాలుతున్న జుట్టును ఆపేందుకు ఈ పండ్లు చాలా ఉపయోగపడుతాయి. ఇందులో సిలికా, ఎలేజిక్ యాసిడ్ కాంబినేషన్ ఉంది. జుట్టును పెంచేందుకు పల్చగా అవకుండా ఆపేందుకు ఈ పండ్లను రోజూ తినాలి.
బొప్పాయి పండ్లు చర్మంతో పాటు అంతర్గత ఆరోగ్యానికి చాలా మంచిది. అమైనో యాసిడ్లు, కోలోజన్, విటమిన్ సి పెద్దఎత్తున ఉంటాయి. మస్కిష్కానికి బలం చేకూర్చే సామర్ధ్యం కలిగున్నాయి. జుట్టును పటిష్టంగా ఉంచేందుకు దోహదపడే వి విటమిన్ సి కోలోజన్ ఉత్పత్తిని పెంచుతుంది.
కివీ (Kiwi)పండ్లు కాస్త తీపిగా కాస్త పులుగా ఉండే విటమిన్ సి Vitamin cతో సమృద్ధిగా ఉంటాయి. కొంతమంది ఇష్టంగా తింటారు. మరి కొంతమంది కష్టంగా తింటారు. ఈ పండ్లు మస్కిష్కానికి పోషకపదార్ధాల్ని రక్త ప్రసరణను Blood Circulation పెంచుతుంది.
Next Gallery