Revanth Reddy Birth Day: ఎక్కడా చూడని రేవంత్‌ రెడ్డి అరుదైన ఫొటోలు.. 10 ముఖ్యమైన విషయాలు

Revanth Reddy Top 10 Secrets: ఎలా వచ్చినా.. ఏం చేసినా చివరికి విజయం సాధించాడా? లేదా అనేది అందరూ చూస్తారు. అలా విజయం సాధించిన వారిలో రేవంత్‌ రెడ్డి ఒకరు. తన జీవితంలో అత్యున్నత పదవి పొందిన రేవంత్‌ రెడ్డి చేసుకుంటున్న ఈ జన్మదినం చాలా ప్రత్యేకతమైనది. బర్త్‌ డే సందర్భంగా రేవంత్‌ గురించి కొన్ని రహాస్య విషయాలు తెలుసుకుందాం.

1 /11

స్వస్థలం: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి రేవంత్‌ రెడ్డి స్వగ్రామం.

2 /11

ఉమ్మడి కుటుంబం: ఎనుముల వంశంలో రేవంత్‌ రెడ్డి కుటుంబం చాలా పెద్దది. రేవంత్‌కు ఏడుగురు సోదరులు, ఒక సోదరి.

3 /11

కుటుంబం: రేవంత్ రెడ్డికి భార్య, కుమార్తె, అల్లుడు మనవడు రియాన్ష్‌ రెడ్డి ఉన్నారు. రేవంత్‌కు రాజకీయంగా, వ్యాపారపరంగా సోదరులు అండగా నిలుస్తుండడం విశేషం.

4 /11

పెయింటింగ్‌ పని: తొలి దశలో రేవంత్‌ రెడ్డి పెయింటింగ్‌ పని చేశారని అక్కడి గ్రామస్తులు, అతడి సన్నిహితులు చెబుతున్నారు. అనంతరం వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి విజయవంతమయ్యారు.

5 /11

తొలి ఉద్యోగం: ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన 'జాగృతి' అనే వార పత్రికలో రేవంత్‌ పని చేశారు. ఆ క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో రేవంత్‌కు మంచి అనుబంధం ఉంది. తదనంతరం అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ (బీఆర్‌ఎస్‌)లో చేరి కార్యకర్తగా పని చేశారు.

6 /11

టీఆర్‌ఎస్‌లో బిజీ: బీఆర్‌ఎస్‌ పార్టీలో రేవంత్‌ గులాబీ కార్యకర్తగా చురుగ్గా ఉన్నారు. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ప్రస్తుత మాజీమంత్రి హరీశ్ రావు వెంట రేవంత్‌ రెడ్డి తిరిగాడు.

7 /11

టీడీపీలోకి: స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీచేసిన రేవంత్‌ రెడ్డి అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

8 /11

అరెస్ట్‌ కీలక మలుపు: తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ ఓటు విషయంలో ఓటుకు నోటుకు పాల్పడుతూ అరెస్ట్‌ కావడం రేవంత్‌ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది.

9 /11

అదృష్టం కలిసి: పిన్న వయసులో పీసీసీ అధ్యక్షుడిగా.. ముఖ్యమంత్రిగా కావడం రేవంత్‌ రెడ్డి అదృష్టంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

10 /11

చెడ్డపేరు: అధికారంలోకి వచ్చి 10 నెలలు కూడా పూర్తి కాలేదు కానీ ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోని రీతిలో ప్రజల నుంచి రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. దురుసు ప్రవర్తన, భాష అనేది రేవంత్‌ రెడ్డికి చెడ్డపేరు తీసుకొస్తోంది.

11 /11

శుభాకాంక్షలు: ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జీ తెలుగు న్యూస్‌ తరఫున రేవంత్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు