Best Summer Vegetables: వేసవిలో బ్లడ్ షుగర్ పెరిగిపోతుందా, ఈ 5 కూరగాయలు డైట్‌లో ఉంటే చాలు

ఆధునిక జీవన విధానంలో మధుమేహం ప్రదాన సమస్యగా మారింది. ఇండియాలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా మదుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. మధుమేహం వ్యాధిగ్రస్థులు ప్రదానంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జీవనశైలి సక్రమంగా ఉండేట్టు చూడాలి. సాధారణంగా వేసవికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. అందుకే 5 రకాల ఆహార పదార్ధాలు డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు.

Best Summer Vegetables: ఆధునిక జీవన విధానంలో మధుమేహం ప్రదాన సమస్యగా మారింది. ఇండియాలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా మదుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. మధుమేహం వ్యాధిగ్రస్థులు ప్రదానంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జీవనశైలి సక్రమంగా ఉండేట్టు చూడాలి. సాధారణంగా వేసవికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. అందుకే 5 రకాల ఆహార పదార్ధాలు డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు.

1 /5

పాలకూర ఆకు కూరల్లో పాలకూర అద్భుతమైంది. చాలా రకాల వ్యాధుల్ని ఇది దూరం చేస్తుంది. పాలకూర గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది. 

2 /5

చియా సీడ్స్ చియా సీడ్స్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. చాలా వ్యాధులు దూరం చేయవచ్చు. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండేలా చేస్తాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 

3 /5

పచ్చి బొప్పాయి పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని కూర రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది. 

4 /5

బ్రోకలీ బ్రోకలీ శరీరంలోని చాలా వ్యాధుల్ని దూరం చేసేందుకు దోహదపడుతుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే. అందులో బ్రోకలీ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంచడంలో బ్రోకలీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

5 /5

కీరా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే ప్రధానంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు బాగుండాలి. ముఖ్యంగా వేసవిలో మరింత అప్రమత్తత ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. అందుకే వేసవిలో రోజూ కీరా తినడం అలవాటు చేసుకోవాలి.