BP Precautions: సైలెంట్ కిల్లర్‌గా ప్రాణాలు తీసే బీపీతో జాగ్రత్త, ఈ అలవాట్లు మార్చుకోండి

ఆధునిక జీవన విధానంలో హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. ఓ సైలెంట్ కిల్లర్‌గా ప్రాణాలు హరిస్తోంది. ఎందుకంటే చాలామందిలో ఈ లక్షణం కన్పించదు. ఇది చాలా ప్రమాదకరం. గుండె వ్యాధులు, స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమౌతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి యేటా 75 లక్షల మరణాలు రక్తపోటు కారణంగానే సంభవిస్తున్నాయి. రక్తపోటు సమస్యను తగ్గించేందుకు ఎలాంటి మార్పులు చేయాలనేది తెలుసుకుందాం..

BP Precautions: ఆధునిక జీవన విధానంలో హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. ఓ సైలెంట్ కిల్లర్‌గా ప్రాణాలు హరిస్తోంది. ఎందుకంటే చాలామందిలో ఈ లక్షణం కన్పించదు. ఇది చాలా ప్రమాదకరం. గుండె వ్యాధులు, స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమౌతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి యేటా 75 లక్షల మరణాలు రక్తపోటు కారణంగానే సంభవిస్తున్నాయి. రక్తపోటు సమస్యను తగ్గించేందుకు ఎలాంటి మార్పులు చేయాలనేది తెలుసుకుందాం..

1 /5

ఒత్తిడి ఒత్తిడి, మానసిక సమస్యలు కూడా అధిక రక్తపోటుకు కారణమౌతుంటాయి. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

2 /5

మద్యపానం ఎక్కువగా మద్యపానం సేవించడం కూడా అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచాలంటే మద్యపానానికి దూరంగా ఉండాలి.

3 /5

సిగరెట్ స్మోకింగ్ అధిక రక్తపోటుకు కారణాల్లో మరో ముఖ్యమైంది అధిక రక్తపోటు. ధూమపానం వల్ల ఈ సమస్య మరింత పెరిగిపోతుంది. 

4 /5

శారీరక వ్యాయామం లేకపోవడం అస్తవ్యస్థమైన జీవనశైలి కూడా అధిక రక్తపోటుకు కారణమౌతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.

5 /5

అనారోగ్యకరమైన ఆహారం అధిక రక్తపోటుకు కారణమయ్యే వాటిలో ప్రధానమైంది అనారోగ్యకరమైన ఆహారం. సోడియం, పంచదార ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది.