Fancy Numbers: ఫ్యాన్సీ నంబర్లకు భారీ క్రేజ్.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన నంబర్ ఇదే..!

Book Fancy Vip Vehicle Number: ప్రతి ఒక్కరు తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబరు ఉండాలని కోరుకుంటారు. తమకు ఇష్టమైన నంబర్ కోసం వేలం పాటలో లక్షలు వెచ్చించేందుకు కూడా రెడీ అవుతారు. తాజాగా హర్యానాలోని కైతాల్‌లో ఓ నంబర్ కోసం ఏకంగా రూ.4.5 లక్షలకు ఖర్చు చేశాడు ఓ వ్యక్తి.
 

  • Mar 23, 2023, 20:27 PM IST
1 /5

కైతాల్‌లోని ఎస్‌డీఎం కార్యాలయంలో నిర్వహించిన వేలంపాటలో వీఐపీ నంబర్‌లను పొందేందుకు భారీ పోటీ నెలకొంది. కొత్తగా ప్రారంభించిన సిరీస్‌లోని 33 నంబర్‌లను బిడ్డింగ్‌కు ఉంచారు. వీటిలో చాలా నంబర్ల బ్రేస్ ప్రైజ్ రూ.50 వేలు, కొన్నింటికి రూ.20 వేలుగా నిర్ణయించారు.  

2 /5

ఈ బిడ్‌లో హెచ్‌ఆర్‌ 08F సిరీస్‌లో అత్యధిక బిడ్ 7777 నంబరుకు ఉంచారు. ఇందుకోసం సందీప్ మౌద్గిల్ రూ.4 లక్షల 50 వేలకు వేలం వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.   

3 /5

ఈ సంఖ్య బేస్ ప్రైస్ 50 వేల రూపాయలు. తన ఫార్చ్యూనర్ కారు కోసం ఈ నంబర్‌ను భారీ డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశాడు.  

4 /5

అదేవిధంగా 8888 అనే నంబర్ లక్షా 5 వేల రూపాయలలకు అమ్ముడు పోయింది. 1111 నంబర్ రూ.95 వేలు, 1000 నంబర్ రూ.80 వేలు, 9999 నంబర్ రూ.60 వేలకు అమ్ముడయ్యాయి. ఈ నంబర్లన్నింటికీ బేస్ ధర రూ.50 వేలుగా ఉంచారు. అదేవిధంగా రూ.20 వేల బేస్ ప్రైస్‌పై ఉన్న 1100 నంబర్‌ను రూ.36 వేలకు కొనుగోలు చేశారు.  

5 /5

వేలంపాటలో ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు భారీ పోటీ పడ్డారు. దీంతో వేలంపాట రసవత్తరంగా సాగింది.