హీరో నితిన్ పెళ్లి ఎప్పుడంటే... !!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో నితిన్‌.. ఐతే ఇప్పటికే ఈ బ్యాచిలర్ హీరో .. పెళ్లికి సై అన్నాడు.  మరికొద్ది రోజుల్లోనే  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

  • Feb 15, 2020, 15:37 PM IST

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో నితిన్‌.. ఐతే ఇప్పటికే ఈ బ్యాచిలర్ హీరో .. పెళ్లికి 'సై' అన్నాడు.  మరికొద్ది రోజుల్లోనే  ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి శాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరిద్దరిదీ లవ్ కమ్  అరేంజ్‌డ్ మ్యారేజ్ కావడం విశేషం.

1 /3

హీరో నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 16న ఆయన శాలినితో ఏడడుగులు వేయనున్నాడు. హీరో నితిన్, శాలినిల పెళ్లి దుబాయ్ లో జరగనుంది. పెళ్లిని డెస్టినేషన్ మ్యారేజ్ పద్ధతిలో నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

2 /3

గతంలో హీరో నితిన్ పెళ్లి కథతో నిర్మితమైన వేంకటేశ్వర కళ్యాణం సినిమాలో నటించాడు. ఆ సినిమా..  సంప్రదాయ పద్దతిలో పెళ్లిళ్లు కరువై .. డెస్టినేషన్ మ్యారేజ్ లు ఎక్కువవుతున్నాయని.. ఫలితంగా మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతున్నారనే సబ్జెక్ట్ తో తీశారు. 

3 /3

ఇప్పుడు హీరో నితిన్ కూడా అలాంటి మ్యారేజ్ చేసుకోవడం విశేషం. మరోవైపు హీరో నితిన్ పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. నితిన్, శాలిని ఎంగేజ్ మెంట్ కు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.