Pan Card: పాన్‌కార్డ్ ఉపయోగాలేంటో తెలుసా…

  • Nov 25, 2020, 19:20 PM IST

 

Pancard అనేది కేవలం ఇన్‌కంటాక్స్ చెల్లించేవారి కోసమే అని అనుకుంటారు.  కానీ పాన్‌కార్డ్ వినియోగం మన జీవితంలో చాలా సార్లు ఉంటుంది. పాన్‌కార్డ్ లేకపోతే ఇబ్బంది కూడా ఎదురవుతుంది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ నుంచి మొదలుకుని..లావాదేవీల వరకూ పాన్‌కార్డ్ ఇప్పుడు ఓ భాగమైపోయింది. అసలు పాన్‌కార్డ్ ఎప్పుడెప్పుడు అవసరమా అనేది ఇప్పుడు తెలుసుకోండి..

1 /5

ఇక అందరికీ  తెలిసినట్టే..ఇన్ కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు పాన్ కార్డు కావాలి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు కూడా పాన్ కార్డు అవసరమే  

2 /5

ఒకవేళ మీరు  ఏ బ్యాంకులో అయినా అక్కౌంట్ ఓపెన్ చేస్తే..అప్పుడు కూడా పాన్ కార్డు అవసరముంటుంది. సేవింగ్ బ్యాంక్ ఎక్కౌంట్ అయినా లేదా కరెంట్ ఎక్కౌంట్  అయినా సరే..పాన్ కార్డు అవసరమే. అంతేకాదు..డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయాలనుకున్నా సరే..పాన్ కార్డ్ అవసరమే  

3 /5

ఒకవేళ మీరు 5 లక్షల కంటే ఎక్కువ విలువలో వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..లేదా పాత కారైనా..బండైనా అమ్మేయాలనుకుంటున్నారా..ఆ సమయంలో మీరు పాన్ కార్డు వివరాలు తప్పకుండా ఇవ్వాల్సిందే. టెలీఫోన్ కనెక్షన్ కు కూడా పాన్ కార్డు వివరాలు అవసరం  

4 /5

మీరు 5 లక్షల కంటే ఎక్కువ  విలువైన నగలు కొంటున్నారా..అయితే కొనుగోలు చేసే సమయంలో మీకు తప్పకుండా పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిందే.  

5 /5

ఒకవేళ మీరు సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టాలనుకున్నారా..50 వేల కంటే ఎక్కువ లావాదేవీ చేస్తున్నారా..అయితే పాన్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సిందే. అంతేకాదు ఫారిన్ ఎక్స్చేంజ్, ప్రాపర్టీ, లోన్, క్యాష్ డిపాజిట్ వంటి వాటికి కూడా పాన్ కార్డ్ తప్పనిసరి.