Tata Group Works: టాటా సంస్థకు భారతదేశంతో వందేళ్లకు పైగా అనుబంధముంది. 1892లో సర్ జంషెడ్ జీ టాటా ట్రస్ట్ స్థాపించారు. టాటా ట్రస్ట్ అనేది పలు ఛారిటబుల్ ట్రస్టుల గ్రూప్. ఈ గ్రూప్‌లో రెండు ప్రముఖ ట్రస్ట్‌లు ఉన్నాయి. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్. బిలియన్ కోట్ల టాటా సామ్రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
నోయెల్ హెచ్ టాటా, సూనీ ఎన్ టాటా కుమారుడు నోయెల్ టాటా ప్రస్తుతం టాటా గ్రూప్‌కు చెందిన వివిధ కంపెనీల పాలక మండలిలో భాగం. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, సంస్థలకు ఛైర్మన్‌గా , టాటా స్టీల్ ఇతర కంపెనీలకు వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
రతన్ టాటా మరణానంతరం అతని సవతి సోదరుడు నోయెల్ టాటాను టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ముంబైలో జరిగిన భేటీ అనంతరం ట్రస్టీలంతా కలిసి నోయెల్ టాటాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. టాటా ట్రస్ట్ నియంత్రణ అంతా టాటా సన్స్ సంస్థపై ఉంది. టాటా సన్స్ నియంత్రణ టాటా గ్రూప్‌పై ఉంది.
అంటే టాటా ట్రస్ట్ నియంత్రణ అంతా టాటా సన్స్ సంస్థకు ఉంది. టాటా సన్స్ నియంత్రణ టాటా గ్రూప్‌కు ఉంది. అంటే టాటా ట్రస్ట్ చైర్మన్‌కు టాటా వ్యాపారాలపై సర్వాధికారం ఉంది. సాధారణంగా ఈ పదవి టాటా కుటుంబం లేదా పార్శీ వర్గాలకు చెందినవారికే దక్కుతుంది. అందుకే నోయెల్ టాటా ఈ పదవికి ఎంపికయ్యారు.
టాటా సన్స్ 1917లో స్థాపించారు. టాటా గ్రూప్‌లో ఉండే అన్ని బ్రాండ్స్‌కు ప్రమోట్ అండ్ హోల్డింగ్స్ రూపంలో ఉండేది. నటరాజన్ చంద్రశేఖరన్ 2017 నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు. టాటా గ్రూప్ కంపెనీలన్నింటిలో 25 శాతం నుంచి 73 శాతం వరకూ వాటా టాటా సన్స్‌దే.
1892లో టాటా ట్రస్ట్ సంస్థను సర్ జంషెడ్ జీ టాటా స్థాపించారు. 1918లో సర్ రతన్ టాటా ట్రస్ట్ స్థాపన జరిగింది. 1932లో సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ స్థాపన జరిగింది. సర్ జంషెడ్ జీ టాటా మరణానంతరం కుమారుడు టాటా గ్రూప్ అన్ని కంపెనీలను విలీనం చేసి టాటా సన్స్ స్థాపించారు
టాటా ట్రస్ట్‌కు చెందిన అన్ని ఛారిటబుల్ ట్రస్ట్‌లకు చెందిన ఓ గ్రూప్. ఈ గ్రూప్‌లో సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దోరాబ్దీ టాటా ట్రస్ట్ ఉన్నాయి. ఈ రెండు ట్రస్ట్‌ల వద్ద టాటా సన్స్‌కు చెందిన మొత్తం 52 శాతం వాటా ఉంది. ఇతర ట్రస్టుల వద్ద టాటా సన్స్‌లో మొత్తం 14 శాతం వాటా ఉంది. అంటే టాటా ట్రస్ట్ వద్ద టాటా సన్స్‌కు చెందిన దాదాపు 66 శాతం వాటా ఉంది.