New Names In Ration Card: పేద ప్రజలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైనది .రేషన్ సరుకులు పొందడం నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల కు అర్హత సాధించడానికి ఈ రేషన్ కార్డు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అందుకే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు.
New Names In Ration Card: అయితే కొత్తగా పెళ్లయిన వాళ్లు తమ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చిన వధువుతో పాటు పుట్టిన పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇది ఎలా చేయాలి? అనేది చాలామందికి తెలియదు. అందుకే ఈ స్టోరీ మీకోసం. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీ రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చాలని అనుకుంటే.. కొన్ని ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ముందుగా ఆధార్ కార్డు తప్పనిసరి. చిన్న పిల్లల పేర్లు చేర్చాలంటే వారి జనన ధ్రువీకరణ పత్రం కావాల్సి ఉంటుంది. పెళ్లి ద్వారా మీ కుటుంబంలోకి వస్తే దాని నిర్ధారించేందుకు వివాహ దృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.
రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడానికి ప్రస్తుతం ఆన్లైన్లో ఎలాంటి ఛాన్స్ లేదు. అందువల్ల ఆఫ్ లైన్ లోనే ఈ పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం FSC కరెక్షన్ ఫామ్ తీసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో ఇది లభిస్తుంది. లేదంటే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారం లో ఇలా పూర్తిగా నింపండి: మీ రేషన్ కార్డు నెంబరు మొదటి కాలంలో ఎంటర్ చేయండి. తర్వాత నెంబర్ అడిషన్ బాక్స్ లో రైట్ మార్క్ పై క్లిక్ చేయండి. తర్వాత కొత్తగా చేర్చాలనుకుంటున్న వారి అడ్రస్ రాయండి. ఆ వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్ వంటి పూర్తి వివరాలను యాడ్ చేయాలి. ఇలా ఫారం పూర్తి చేసిన తర్వాత అవసరమైన ధృవపత్రాలను దానికి అటాచ్ చేయాలి. ఆ తర్వాత ఈ దరఖాస్తు ఫారం ను మీ సేవ కేంద్రంలో అందించండి.
దరఖాస్తు ఫారం వారికి అందించిన తర్వాత వారి నుంచి ఒక రసీదు తీసుకోండి. మీ పని పూర్తి కావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. కాబట్టి దరఖాస్తు చేసినట్టుగా ఆ రసీదు మీ దగ్గర ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని విషయాన్ని మీరు తెలంగాణ అధికారిక https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్ని సందర్శించండి.
ఇప్పుడు హోం పేజ్ లో ఎడమ వైపున ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో fsc అప్లికేషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ జిల్లా, మీ అప్లికేషన్ నెంబర్, ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్ కనిపిస్తుంది.
ఇప్పటికే ఉన్న మీ రేషన్ కార్డు వివరాలు తెలుసుకోవాలనుకుంటే fsc సెర్చ్ మీద క్లిక్ చేసి.. లోపలికి వెళ్లిన తర్వాత రేషన్ కార్డు కాలంలో మీ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ రేషన్ కార్డు డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. మీ కార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు కూడా అక్కడ కనిపిస్తాయి .