Healthy Drinks: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్, మలబద్ధకం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. అయితే ఈ 5 నేచురల్ డ్రింక్స్ ఈ సమస్యలకు సులభంగా చెక్ పెడతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
గమనిక....అయితే ఈ చిట్కాలన్నీ కేవలం అవగాహన, చైతన్యం కోసం మాత్రమే. ఆరోగ్యపరంగా సమస్యలున్నవాళ్లు వైద్యుని సలహా మేరకే ఈ పద్ధతులు పాటించాలి.
లెమన్ గ్రాస్ టీ రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు కడుపును శుభ్రంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
మసాలా లెమన్ వాటర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. దాంతో నీటి కొరత ఉండదు
ఆపిల్ సైడర్ వెనిగర్ తేనె కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కన్పిస్తాయి. ఇది చాలా ఆరోగ్యకరం. రెండూ కలిపి సేవిస్తే ప్రేవుల మైక్రోబయోమ్‌పై పాజిటివ్ ప్రభావం పడుతుంది. తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్ రెండింట్లో ప్రోబయోటిక్ గుణాలు ప్రేవుల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
భోజనానికి ముందు అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందంటారు. అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. కడుపులో ఎసిడిటీ, కడుపు నొప్పి, మంట దూరమౌతాయి.
మలబద్ధకం అన్నింటికంటే ప్రమాదకరమైంది. ఈ సమస్యను దూరం చేసేందుకు సాల్ట్ వాటల్ బెస్ట్ ఆప్షన్. సాల్ట్ వాటర్ తాగడం వల్ల మీ ప్రేవుల్లో చేరిన సాల్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీపీ రోగులు ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలి