Urine Color Signs: మనిషి ఆరోగ్యం అనేది ఆ మనిషి విసర్జించే మూత్రాన్ని బట్టి చెప్పవచ్చంటారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 7-8 సార్లు యూరిన్ పోయగలడు. యూరినేషన్ ద్వారా శరీరంలోని విష పదార్ధాలు సులభంగా బయటకు తొలగిపోతాయి. అయితే యూరిన్ ఒక్కోసారి ఒక్కో రంగులో ఉంటుంది. ఇది మీరు ఏ మేరుక ఆరోగ్యంగా ఉన్నారనేది చెబుతుంది.
రెడ్ కలర్ యూరిన్ రంగు రెడ్ ఉంటే ఇన్‌ఫెక్షన్ అయి ఉండవచ్చు లేదా బీట్‌రూట్ జ్యూస్ తాగడం లేదా మందుల ప్రభావం అయుంటుంది.
బ్రౌన్ రంగు గాల్ బ్లేడర్ లేదా పిత్తాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే యూరిన్ రంగు బ్రౌన్ ఉంటుంది. పిత్తాశయంలో ముప్పు లేదా బ్లాకేజ్ ఉంటే ఇలా ఉంటుంది.
గ్రీన్ బ్రౌన్ యూరిన్ కలర్ ఫుడ్స్, కలర్ మెడిసిన్స్ వాడినప్పుడు కూడా యూరిన్ రంగు మారుతుంది. యూరిన్ రంగు గ్రీన్ బ్రౌన్ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి
మేఘం లాంటి రంగు చాలా సందర్భాల్లో యూరిన్ రంగు మేఘాల్లో మసకగా ఉండవచ్చు. ఇలా ఉంటే సీరియస్ ఇన్‌ఫెక్షన్ ఉందని అర్ధం. బ్లేడర్‌లో ఇన్‌ఫెక్షన్ ఉంటే ఇలానే కన్పిస్తుంది
లైట్ ఎల్లో ఒకవేళ మీ యూరిన్ రంగు లైట్ ఎల్లో ఉంటే మీరు తగినంత నీళ్లు తాగడం లేదని అర్ధం. మీరు రోజుకు తీసుకోవల్సిన నీటి పరిమాణం పెంచాల్సి ఉంటుంది. డయాబెటిస్, కిడ్నీ వ్యాధులున్నప్పుడు కూడా యూరిన్ రంగు మారవచ్చు
డార్క్ ఎల్లో మీ యూరిన్ రంగు డార్క్ ఎల్లో ఉంటే మీ శరీరం డీహైడ్రేట్ అయిందని అర్ధం. అంటే మీరు ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. లేదా నిమ్మరసం తాగాలి.