SBI: సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునేవారికి..ఎస్‌బీఐ గుడ్ న్యూస్


SBI: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ బ్యాంక్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటిని కొనుగోలు చేయాలనుకునేవారికి రెండు శుభవార్తలను తీసుకువచ్చింది. అవేంటో చూద్దాం. 

1 /6

SBI: సొంతింటి కల అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలని లేదా కట్టుకోవాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటే బాగుండని భావిస్తుంటారు. అయితే ఈ కలను అందరూ సాకారం చేసుకోలేకపోవచ్చు.   

2 /6

ఎందుకంటే ఇల్లు కొనడం అనేది అంత సులభం కాదు. పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే అందరూ ఇల్లు కొనడం కష్టం. అయితే కొంతమంది మాత్రం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఇల్లు కొంటుంటారు.   

3 /6

మీరు కూడా కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్  చేస్తుంటే మీకోసం మంచి ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది ఎస్బీఐ బ్యాంకు. దేశంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒక్కటిగా ఉంటూ వస్తున్న స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా ఈ ప్రకటనను చేసింది. 

4 /6

ఎస్బిఐ 2024 డిసెంబర్ 20 నుంచి డిసెంబర్  22వ తేదీ  వరకు మాదాపూర్ లోని హైటెక్స్ లో హైదరాబాద్ కు చెందిన 50 మందికిపైగా పెద్ద బిల్డర్ లతో మెగా ప్రాపర్టీ ఎక్స్ పోను నిర్వహిస్తుంది.   

5 /6

ఈ మెగా ప్రాపర్టీ షో అనేది కస్టమర్లకు వారి కలల ఇంటిని పొందేందుకు వన్ స్టాప్ సొల్యూషన్స్ ను అందిస్తుంది. ప్రాపర్టీ షోలో తమ ఇంటిని బుక్ చేసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేట్లలో రాయితీలను కూడా అందిస్తాయిని చెప్పుకోవచ్చు.   

6 /6

హైదరాబాద్ సర్కిల్ లో 2024 నవంబర్ 30 నాటికి ఎస్బిఐ రూ. 66.249 కోట్ల ఇండ్లు లోన్ పోర్టుపోలియే కలిగి ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో రూ. 14,578 కోట్ల హౌసింగ్ లోన్స్ రూ. 5,732  కోట్ల టాప్ అప్ లోన్స్ జారీ చేశామని సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ చెప్పారు.