Old 5 Rupees Coins: ఆర్‌బీఐ షాకింగ్ నిర్ణయం..? రూ.5 నాణేలు రద్దు..!

5 Rupees Coins in India: ప్రస్తుతం మార్కెట్‌లో మనకు సరికొత్త నాణేలు కనిపిస్తున్నాయి. వాటిలో రూ.20, రూ.10, రూ.5 నాణేలను మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పటివరకు వాడుకలో ఉన్న పాత రూ.5 నాణేలను దశలవారీగా రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నాణేల ముద్రణను నిలివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
 

1 /7

బ్లాక్ మనీని అరికట్టేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచనల నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో రూ.2 వేల నోటును కొత్తగా ప్రవేశపెట్టింది.  

2 /7

పరిస్థితులు అంతా సెట్ అయిన తరువాత రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంది. దీంతో ప్రస్తుతం రూ.500 నోటు వరకు మాత్రమే చలామణిలో ఉన్నాయి.  

3 /7

మరోవైపు మన దేశంలో రూ.1 నుంచి రూ.20 నాణేలు వరకు వాడుకలో ఉన్నాయి. త్వరలో రూ.30, రూ.50, రూ.100 డినామినేషన్లలో కొత్త కరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.  

4 /7

ఈ నేపథ్యంలో 5 రూపాయల నాణెం రద్దవుతుందని ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

5 /7

ప్రస్తుతం మన దేశంలో రెండు రకాల 5 రూపాయల నాణేలు అందుబాటులో ఉన్నాయి. పాలిష్ చేసిన ఇత్తడి, వెండి రంగు ఉక్కు నాణేలు వాడుకలో ఉన్నాయి.   

6 /7

పాత 5 రూపాయల నాణేలను అక్రమంగా బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారని.. వాటిని కరిగించి పదునైన బ్లేడ్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉంది.  

7 /7

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 5 రూపాయల నాణేల ముద్రణను నిలిపివేసిందని అంటున్నారు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.