Winter Weight Loss Tips: చాలామంది శీతాకాలంలో బరువు పెరిగిపోతూ ఉంటారు.. దీని కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. అంతేకాకుండా సమయంలో బరువు తగ్గడానికి అనేక పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతారు. అయితే ఈ చిట్కాలతో సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Weight Loss In 12 Days: శీతాకాలంలో వాతావరణం లోని తేమ పెరగడం కారణంగా చలి తీవ్రత కూడా రెట్టింపు అవుతుంది దీనికి కారణంగా అందరూ ఉదయాన్నే నిద్రలేచేందుకు ఆసక్తి చూపరు. అంతేకాకుండా కొంతమంది ఈ సమయంలో వ్యాయామాలు చేయడం, వాకింగ్ చేయడం కూడా మానేస్తూ ఉంటారు. దీని కారణంగా సులభంగా బరువు పెరుగుతారు. అయితే ఇలా బరువు పెరిగినవారు శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా శీతాకాలంలో బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీలైతే ఉదయాన్నే లేచి ఇంట్లో వాకింగ్ చేయడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శీతాకాలంలో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా డైట్లను పాటించాలి. దీంతోపాటు యోగాసనాలు వేయడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రించుకోవచ్చు.
చమోమిలే టీని శీతాకాలంలో ప్రతిరోజు తాగడం వల్ల ఎంత బరువైన సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ టీలో అనేక పోషకాలు నిండి ఉంటాయి. కాబట్టి ఈ టీ ని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపరడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి.
శీతాకాలంలో తొందరగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా గ్రీన్ టీని తాగాలి. ఇందులో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించి బరువును నియంత్రిస్తాయి. అంతేకాకుండా బాడీలో పేరుకుపోయిన మురికి పదార్థాలను బయటికి పంపిస్తాయి.
బ్లాక్ టీ లో కెఫీన్ అనే మూలకం ఉంటుంది. కాబట్టి ఈ టీని శీతాకాలంలో రెండు పూటలు తాగడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు సమస్యల బారిన పడకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా డైట్లో బ్లాక్ టీని చేర్చుకోవాల్సి ఉంటుంది .