Income Tax Recruitment 2025: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసకుని దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ విడుదలైన నెలలోనే ఈ దరఖాస్తు పూర్తి చేయాలి.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్డ్‌మెంట్‌లో 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్ లేదా ఎంటెక్ చేసి ఉండాలి.
ఆప్షన్ బీ.. కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్‌లో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
ఆప్షన్ సీ.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మాస్టర్ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింతోపాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
ఆప్షన్ డీ.. DOEACC లేదా పోస్ట్ గ్రాడ్యూయేట్ డిప్లొమ కంప్యూటర్ అప్లికేషన్‌లో పూర్తి చేఉఇ ఉండాలి. డేటా ప్రాసెసింగ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 56 ఏళ్లు కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.44,900 నుంచి రూ.1,42,000 నెలకు సంపాదిస్తారు ఇది 7వ వేతన సంఘం ఆధారంగా అందిస్తారు. అధికారిక వెబ్ సైట్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.