Bank Notice: బ్యాంకులో తరచూ డబ్బులు వేస్తే.. ఐటీ నోటీసులు వస్తాయా? లిమిట్‌ ఎంత?

Bank Notice Deposit Limit: మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. అక్కడే భద్రంగా ఉంటాయని ఆలోచన చేస్తారు. అంతేకాదు ఈ కాలంలో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ కూడా ఎక్కువయ్యాయి. దీంతో చాలామందిలో ఒక సందేహం మొదలైంది. ఇలా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేయడం వల్ల ఐటీ నోటీసులు వస్తాయా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్‌, విత్‌డ్రా చేస్తుంటాం. అయితే, ఈ కాలంలో యూపీఐ పేమెంట్స్‌ ఎక్కువగా చేస్తున్నాం. అంటే మన బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బులు డెబిట్‌ అవుతాయి.  

2 /5

అలాగే మన ఖాతాల్లో డబ్బులు క్రెడిట్‌ కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగిపోతాయి. అయితే, ఓ పరిమితి వరకు ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చు. ఆ లిమిట్‌ దాటితే ఐటీ నోటీసులు వస్తాయి.  

3 /5

ఇటీవల ఓ పానీపూరి విక్రయదారుడికి కూడా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చూసి ఏడాదికి రూ.40 లక్షల ఆదాయం వస్తోందని ఐటీ అధికారులు సదరు పానీపూరి విక్రయదారుడికి నోటీసులు పంపారు. ఇదంత ఎక్కువగా యూపీఐ పేమంట్స్‌ వాటి హిస్టరీ చూసి వేశారు.  

4 /5

ఏడాదికి రూ.10 లక్షలకు మించి బ్యాంకు డిపాజిట్‌ చేయడం వల్ల ఐటీ నోటీసులు వస్తాయి. రూ.50 వేలు డిపాజిట్‌ చేసినా  పాన్‌ కార్డు నంబర్‌ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఛార్జీలు వసూలు చేస్తారు.  

5 /5

అంతేకాదు ఇలాంటి నిబంధన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాకు కూడా వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఐటీ అధికారులకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఏదైనా ఫిక్సెడ్‌ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే దాని విలువ రూ.30 లక్షలకు మించి ఉంటే రిజిస్ట్రేష్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.