Independence Day 2023: 1947 ఆగస్టు 15 వతేదీన దేశానికి స్వాతంత్య్రం లభించింది. అదే సమయంలో ఇండియా, పాకిస్తాన్ దేశాలుగా జరిగిన విభజన రేపిన గాయాలు మానేందుకు చాలా కాలం పట్టింది. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద మానవ విభజనగా చరిత్రలో నిలిచిపోయింది.
Independence Day 2023: దేశ విభజన సమయంలో జరిగిన వేదన, విషాదం అంతా ఇంతా కాదు. నాటి ఆ విషాద ఘటనకు సాక్ష్యంగా నిలిచే కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే చాలు నాడు ఎలా ఉండిందనేది అర్ధమౌతుంది. ఆ ఫోటోలు మీ కోసం...
దేశానికి స్వాతంత్య్రంతో పాటు విభజన గాయం కూడా గట్టిగా తగిలింది. నాటి పోటోలు చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది. విభజన సందర్భంగా దేశంలో లక్షలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
దేశ విభజన గాయం ఇంకా మానలేదు. ద్వేషం, హింస కారణంగా లక్షలాది మంది చెల్లాచెదురయ్యారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. నాటి విభజన గాయాలు చాలామందిలో ఇంకా భయం రేపుతూనే ఉన్నాయి.
1947 ఆగస్టు 15న బ్రిటీషు పాలకుల నుంచి దేశం విముక్తి చెందింది. స్వాతంత్య్రం లభించిందన్న ఆనందంతో పాటు తీరని గాయం కూడా తగిలింది.
దేశ విభజన రేపిన గాయాలు, భయాందోళనతో జనం ప్రాణాలు అరచేత పట్టుకుని దేశాల సరిహద్దులు దాటుతున్న దృశ్యాలు ఆందోళన కల్గిస్తున్నాయి.