Independence Day 2021: దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసినవారిని దేశం స్మరించుకుంటోందన్నారు.
కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారాని..పతకాలు సాధించినవారంతా స్ఫూర్తి అని మోదీ చెప్పారు.
స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన త్యాగధనుల్ని దేశం స్మరించుకుంటోందన్నారు. దేశ సరిహద్దుల్లో పగలూ రాత్రి తేడా లేకుండా పహారా కాస్తున్న వీరజవాన్లకు ప్రణామాలు అర్పించారు ప్రధాని మోదీ.
వైమానిక దళ హెలీకాప్టర్లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించారు. జెండా ఆవిష్కరణ అనంతరం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు.
ఒలింపిక్స్ లో పతక విజేతలు మనందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. కరోనా సంక్షోభంలో పోరాడిన వైద్యులు, సిబ్బంది సేవలు ఎనలేనివని ప్రధాని మోదీ కీర్తించారు.
దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ 8వ సారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.