Ind vs Eng: ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 3 కొత్త రికార్డులు

టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ స్పెల్ ముందు మహా మహా బ్యాటర్లు కూడా వికెట్ పోగొట్టుకుంటుంటారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్‌లో అశ్విన్ రవిచంద్రన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించి చాలా రికార్డులు తన పేరిట లిఖించాడు.

Ind vs Eng: టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ స్పెల్ ముందు మహా మహా బ్యాటర్లు కూడా వికెట్ పోగొట్టుకుంటుంటారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్‌లో అశ్విన్ రవిచంద్రన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించి చాలా రికార్డులు తన పేరిట లిఖించాడు.

1 /5

2 /5

ఇంగ్లండ్ రెండవ ఇన్నింగ్స్‌లో అశ్విన్ రవిచంద్రన్-కుల్దీప్ యాదవ్ కలిసి అద్భుతం చేసి చూపించారు. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా అశ్విన్-కుల్దీప్ ద్వయం ముందు ఇంగ్లండ్ కుప్పకూలింది. కుల్దీప్ 4 వికెట్లు , అశ్విన్ 5 వికెట్లు పడగొట్టారు. 

3 /5

అశ్విన్ రవిచంద్రన్ 5 వికెట్ల హాల్ విషయంలో అనిల్ కుంబ్లే రికార్డును సమం చేయడమే కాకుండా మరో రికార్డు సైతంం బ్రేక్ చేశాడు. భారతదేశ గడ్డపై అత్యధిక వికెటట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అనిల్ కుంబ్లే 350 వికెట్లు పడగొట్టితే..అశ్విన్ 351 వికెట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.

4 /5

ఇంగ్లండ్‌పై 100 వికెట్లు..1000 పరుగులు ఇంగ్లండ్‌కు మాత్రం అశ్విన్ రవిచంద్రన్ యముడిలా మారాడు. ఒక జట్టుపై 1000 పరుగులు, 100 వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ క్రికెటర్ అశ్వినే. ఆసియాలో మొదటి క్రీడాకారుడు. 

5 /5

అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసిన అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఇంగ్లండ్ కేవలం 145 పరుగులే చేయగలిగింది. ఈ ఫీట్‌తో అనిల్ కుంబ్లే  రికార్డును సమం చేశాడు. అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 35 సార్లు 5 వికెట్స్ హాల్ సాధించాడు. ఇది కూడా కేవలం 99 మ్యాచ్‌లలో పూర్తి చేశాడు. అనిల్ కుంబ్లే సైతం ఈ ఫీట్ సాధించాడు. కానీ 132 మ్యాచ్‌లు ఆడాడు.