భారత- చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో సారి చైనా మొబైల్ యాప్స్ ను బ్యాన్ చేసింది. ప్రముఖ గేమింగ్ యాప్ పబ్ జీతో సహా 118 యాప్స్ పై బ్యాన్ విధించింది.
చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసకుంది. ఇందులో పబ్ జీచ లివిక్, పబ్ జీ, వీ చాట్ వంటి ఎన్నో ప్రముఖ యాప్స్ ఉన్నాయి.
ఇక ఇందులో ఎక్కవగా వినిపిస్తోన్నపేరు. ఈ యాప్ ను ఇప్పటి వరకు 600 మిలియన్ సార్లు డౌన్ లోడ్ చేశారు. మొత్తం 50 మిలియన్ల యాక్టివ్ ప్లేయర్స్ ఎప్పడూ ఉంటారు. చైనాలో దీన్ని గేమ్ ఆఫ్ పీస్ గా వినియోస్తారు.
భారత దేశ సమగ్రత కోసం, ఎలాంటి మోసాలు లేని సమాజం కోసం.. భారతదేశ రక్షణ కోసం వీటిని బ్యాన్ చేసినట్టు ఎలక్ట్రానిక్స్చ ఇన్ఫర్మేషన్చ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారతదేశ పౌరుల సైబర్ సేఫ్టీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.