Top 5 Oldest Cricketers To Won IPL Title: ఐపీఎల్‌లో యంగ్ క్రికెటర్లే కాదు.. ఎందరో సీనియర్ ప్లేయర్లు కూడా మెరుపులు మెరిపించారు. టీ20 ఫార్మాట్‌లో తాము కూడా తగ్గేదేలే అన్నట్లు సిక్సర్లు, ఫోర్లతో అలరించారు. బౌలింగ్‌లో కూడా యంగ్ బౌలర్లకు పోటీగా వికెట్లు తీసి మెప్పించారు. లేటు వయసులోనూ ఘాటు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ వయసులో ట్రోఫీని అందుకున్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. 41 ఏళ్ల 327 రోజుల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయసు క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ 250 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్ కూడా ధోనినే కావడం విశేషం.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు అతని వయస్సు 40 ఏళ్ల 33 రోజులు.
ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో దక్షిణాఫ్రికా మాజీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కీలకపాత్ర పోషించాడు. ఆ ఏడాది చెన్నై ట్రోఫీని గెలిచినప్పుడు అతని వయసు 39 ఏళ్ల 61 రోజులు.
దివంగత ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలిపాడు. అప్పుడు వార్న్ వయసు 38 సంవత్సరాల 262 రోజులు.
మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2010 సీజన్‌లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు హేడెన్ వయసు 38 సంవత్సరాల 178 రోజులు