Iphone 15 Plus Price: Iphone 15 Plusపై ప్రీ బుకింగ్‌ ప్రారంభం..ధర, డిస్కౌంట్‌, ఫీచర్స్‌ వివరాలు!

Apple Iphone 15 Plus Price In India: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 15 ప్లస్‌ త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రాబోతోంది. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై ప్రీ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఈ ప్రీ బుకింగ్‌ సేల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

  • Sep 15, 2023, 11:58 AM IST

 

Apple Iphone 15 Plus Price In India: ఐఫోన్‌ 15 సిరీస్‌ యాపిల్‌ కంపెనీ బుధవారం విడుదల చేసింది. ఈ ఐఫోన్‌ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ ఒక్కొక్కటిగా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ ప్రీ బుకింగ్‌ సేల్‌ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సేల్‌ భాగంగా మొబైల్స్‌ను కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ బంఫర్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 15 ప్లస్‌పై ఈ రోజు సాయంత్రం ప్రీ బుకింగ్‌ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ మొత్తం మూడు వేరియంట్స్‌(128 GB, 256 GB, 512 GB)లో లభించబోతోంది. అంతేకాకుండా ఐదు రకాల కలర్స్‌ను కలిగి ఉంది.   

2 /5

యాపిల్‌ కంపెనీ ఈ మొబైల్‌ను రూ. 89,900కు విక్రయిస్తోంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అదనపు తగ్గింపు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా  HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి ఈ  ఐఫోన్‌ 15 ప్లస్‌ కొనుగోలు చేస్తే రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది.   

3 /5

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఐఫోన్‌ 15 ప్లస్‌పై యాక్సిస్‌ బ్యాంకు కూడా తగ్గింపును అందిస్తోంది. ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా  ఈ మొబైల్‌ను ప్రతి నెల రూ.3,746 చెల్లించి నో కాస్ట్‌ EMI ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయోచ్చు.  

4 /5

ఇక ఈ మొబైల్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే.. ఫ్రంట్ బాడీ కార్నింగ్ మేడ్ గ్లాస్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్‌లో కార్నింగ్ మేడ్ గ్లాస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఐఫోన్‌ 15 ప్లస్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ని కలిగి ఉంటుంది.   

5 /5

ఐఫోన్‌ 15 ప్లస్‌ OS విషయానికొస్తే..iOS 17తో రాబోతోందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌ Apple A16 బయోనిక్ (4 nm) చిప్‌సెట్‌ని కలిగి ఉంటుంది. ఇది హెక్సా-కోర్ ప్రోసెసర్‌పై పని చేస్తుంది.