Iphone 16 Series: ఐఫోన్‌ 16 సిరీస్‌ మార్కెట్‌లో మ్యాజిక్‌ చేయబోతోంది.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే!

Iphone 16 Series Launch Date And Price Leak: త్వరలోనే మార్కెట్‌లోకి యాపిల్‌ 16 సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్‌, ఇతర వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే ఇటీవలే ఈ యాపిల్‌ 16కి సంబంధించిన ఆసక్తి కరమైన విషయాలను బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

1 /7

బ్లూమ్‌బెర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇటీవలే ఐఫోన్ 16 సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్ అయ్యాయి. ఈ యాపిల్‌ సిరీస్‌ను కంపెనీ ప్రత్యేకమైన ఈవెంట్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.

2 /7

ఈ ఐఫోన్ 16 సిరీస్‌ను కంపెనీ ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రోతో పాటు ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌ అనే నాలుగు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అలాగే వీటికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు కూడా లీక్‌ అయ్యాయి.   

3 /7

ఈ నాలుగు మోడల్స్‌ సెప్టెంబర్ 10న లాంచ్‌ కాబోతున్నట్లు తెలస్తోంది. వీటిని యాపిల్‌ కంపెనీ ప్రత్యేకమైన ఈవెంట్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

4 /7

ఇందులోని బేస్‌ వేరియంట్‌ యాపిల్ కంపెనీ రూ.67,100 ధరతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  

5 /7

ఇక ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ మాత్రం రూ.75,500తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం పెద్ద డిస్ల్పేతో అందుబాటులోకి రానుంది.  

6 /7

ఇక యాపిల్‌ ఐఫోన్‌ 16 ప్రో 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్ ధర రూ. 92,300తో మార్కెట్‌లో లాంచ్‌ కానుంది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.  

7 /7

ఇక iPhone 16 Pro Max స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 1,00,700 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ స్టోరేజ్‌ను బట్టి ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది.