Iphone Se 4 Price And Specifications: ప్రముఖ యాపిల్(Apple) కంపెనీ నుంచి మార్కెట్‌లోకి కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. త్వరలోనే యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ సిరీస్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ యాపిల్ కంపెనీ ఐఫోన్ SE సిరీస్‌ను మొదటగా గతంలో లాంచ్ చేసినప్పటికీ.. అప్డేట్ వేరియంట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. యాపిల్ 17 సిరీస్‌లోనే భాగంగా ఐఫోన్ SE 4 మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా ఇది గత మోడల్స్‌లో పోలిస్తే చాలా రకాల కొత్త ఫీచర్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఐఫోన్ SE 4 మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన టెక్నాలజీతో కూడిన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇందులో కొన్ని ప్రత్యేకమైన AI ఫీచర్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ iPhone SE 4 స్మార్ట్‌ఫోన్స్ కొత్త A18 బయోనిక్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే iPhone 14 డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతోంది.
గతంలో లాంచ్ అయిన SE మోడల్ బ్యాక్ సెటప్‌లో కేవలం ఒకే ఒక కెమెరా కలిగి ఉండేది. అయితే ఈ మోడల్‌లో మాత్రం రెండు కెమెరాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులోని ప్రధాన కెమెరా ప్రత్యేకమైన ఫీచర్స్‌తో లాంచ్ కానుంది.
ఇక iPhone SE 4 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది దాదాపు రూ. 46,000 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయితే రేటులో మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
ఈ మొబైల్ కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే..ఈ మోడల్ 5G కనెక్టివిటీని అందిస్తోంది. దీనితో పాటు 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే eSIM సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ఫ్రంట్ కెమెరా 12MP మెగాపిక్సెల్ ఉంటుంది.