IPL Catches Record: ఫుట్‌బాల్‌కు గోల్ కీపర్ ఎలానో..క్రికెట్‌కు వికెట్ కీపర్ అలానే. వికెట్ కీపర్ స్థానం చాలా కీలకం. గేమ్‌ను పూర్తిగా, నిశితంగా పరిశీలించేది వికెట్ కీపరే. డీఆర్ఎస్ తీసుకోవాలా లేదా అనేది వికెట్ కీపర్ నిర్ణయంపైనే సహజంగా ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ క్యాచ్‌లు తీసుకున్న టాప్ 5 వికెట్ కీపర్స్ గురించి తెలుసుకుందాం..
వృద్ధిమాన్ సాహా పంజాబ్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన వృద్ధిమాన్ సాహా 62 క్యాచ్‌లు పట్టి నాలుగవ స్థానంలో ఉన్నాడు.
రాబిన్ ఊతప్ప ఇక చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ఆడుతున్న మరో వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప. ప్రస్తుతం వికెట్ కీపింగ్ చేయకపోయినా..అద్భుతమైన బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. 58 క్యాచ్‌లు తీసుకుని ఐపీఎల్‌లో ఐదవ స్థానంలో ఉన్నాడు.
పార్ధివ్ పటేల్ ఐపీఎల్‌లో 65 క్యాచ్‌లు పట్టి మూడవ స్థానంలో ఉన్నాడు పార్ధివ్ పటేల్
మహేంద్రసింగ్ ధోని మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 124 క్యాచ్‌లు తీసుకున్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
దినేష్ కార్తీక్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌లో 117 క్యాచ్‌లు తీసుకుని రెండవ స్థానంలో నిలిచాడు. మంచి బ్యాట్స్‌మెన్ కూడా.