CSK Vs GT: బిగ్‌ఫైట్‌కు రెడీ.. ఈ ప్లేయర్లపై ప్రత్యేక దృష్టి

IPL 2023 Latest Updates: ఐపీఎల్ సమరం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్, మాజీ ఛాంపియన్ చెన్నై జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో కొందరి ప్లేయర్లపై ప్రత్యేక దృష్టి నెలకొంది. వారిపై ఓ లుక్కేయండి..

  • Mar 31, 2023, 13:27 PM IST
1 /6

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ఎంఎస్ ధోనికి ఇది చివరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. లాస్ట్‌ సీజన్‌లో ధోని ఎలా ఆడతాడని కచ్చితంగా అందరి చూపు ఉంటుంది. 

2 /6

హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌ను మొదటిసారి ఛాంపియన్‌గా నిలిపాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్‌గానూ తన సత్తా నిరూపించుకున్నాడు. పాండ్యా కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్, బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి ఉంటుంది.

3 /6

బెన్ స్టోక్స్ తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్‌లో స్టోక్స్, ధోనీతో కలిసి ఆడడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఇద్దరూ రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ తరఫున కలిసి ఆడారు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఎలా ఆడతానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  

4 /6

గత కొన్నేళ్లుగా మ్యాచ్‌ ఫినిషర్‌గా.. ఆల్‌రౌండర్‌గా నిలకడగా రాణిస్తున్న రాహుల్‌ తెవాటియా తొలి మ్యాచ్‌లోనే చెలరేగే అవకాశం కనిపిస్తోంది.  

5 /6

ప్రస్తుతం మూడు ఫార్మాట్‌లలో స్థానం కోల్పోయిన అజింక్య రహానేకు ఐపీఎల్ కీలకంగా మారింది. మళ్లీ సత్తా నిరూపించుకుని సెలెక్టర్లలో దృష్టిలో పడాలని చూస్తున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో రహానేకి కచ్చితంగా చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

6 /6

2020 నుంచి ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మకు గుజరాత్ టైటాన్స్ నుంచి మరోసారి అవకాశం లభించింది. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇస్తున్న మోహిత్ శర్మ ఎలా బౌలింగ్ చేస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.