Isha Foundation: ఈషా ఫౌండేషన్. .కోయంబత్తూర్ వేదికగా జగ్గీదేవ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు గుప్తంగా నిర్వహిస్తూనే ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పిల్లలకు చదవుతో పాటు పేదలకు ఎన్నో ఉచిత వైద్య సేవలు అందిస్తూ.. ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా తన వంతు బాధ్యతలను నిర్వహిస్తోంది. తాజాగా వరదలతో అతలాకుతలమైన విజయవాడ వాసులకు తన వంతుగా సాయం అందిస్తున్నారు.
Isha Foundation: గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలను ముంచెత్తాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పొంగి ఇక్కడ ప్రజలకు కన్నీరు తెప్పిస్తే.. ఏపీలో బుడమేరు మొత్తంగా విజయవాడ ప్రజలను వదర బురదలో కూరుకుపోయేలా చేసింది. ఇలాంటి విషత్కర పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు తన వంతు ఆర్ధిక సాయం అందించి వరద సహాయక చర్యల్లో తమ వంతు బాధ్యత నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోలతో పాటు.. ప్రముఖ వ్యాపారస్థులు అందరు ఈ విపత్కర పరిస్థితుల్లో తమ వంతు ఆర్ధిక సాయం ప్రభుత్వానికి ప్రకటించారు. అయితే మరికొందరు స్వయంగా రంగంలోకి దిగి వరద బాధితులకు తక్షణ సాయం అందించే పనిలో పడ్డాయి. అందులో భాగంగా జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈషా ఫౌండేషన్ తన వంతుగా వరద బాధితులకు తన వంతుగా బియ్యం, పప్పు, చింత పండు సహా 13 నిత్యావసరాలు ఇచ్చి వారికి తక్షణ సాయం అందించారు.
విజయవాడ వరద బాధితుల కోసం ఈశా వాలంటీర్ల సహాయక చర్యలు ప్రభుత్వానికి ఎంతో సహకారం అందిస్తున్నాయి. అటు హరే కృష్ణ వాళ్లతో పాటు ఆర్ఎస్ఎస్ వాళ్లు కూడా వరద బాధితులకు అండగా ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. విజయవాడ, పరిసర ప్రాంతాల్లో కృష్ణానది వరద భాదితులకు తమ వంతు సహాయార్థం ఈశా ఫౌండేషన్ ఔట్రీచ్ ద్వారా ఈశా వాలంటీర్లు తమ వంతు చేయూతను అందించారు.
సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నిత్యావసరాలను కిట్ ల రూపంలో పంపిణీ చేశారు. ఇందులో 13 నిత్యావసర వస్తువులతో కూడిన దాదాపు 1000 కిట్ లను సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, గంగానమ్మ గుడి, నాలుగు స్తంభాల లైన్ మొదలగు ప్రాంతాల్లో వరద బాధిత పేద కుటుంబాలకు ఇతోధిక సాయం అందించారు.
సహాయాన్ని అందుకున్న ప్రజులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈషా ఫౌండేషన్ అందించి విలువలైన సాయంపై అభినందనలు కురిపిస్తున్నారు. నాణ్యమైన సరుకులను అందించినందుకు ఈషా ఫౌండేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.