Gaganyaan Launch: సూర్య, చంద్రుల తరువాత ఇప్పుడు గగన్‌యాన్, లాంచ్ తేదీ ఎప్పుడంటే

Gaganyaan Launch: అంతరిక్షానికి ఇండియా సరికొత్త చిరునామాగా మారుతోంది. మొన్న చంద్రుడిపై , నిన్న సూర్యుడిపై విజయం తరువాతక ఇస్రో తదుపరి యాక్షన్‌పై ప్రపంచమంతా దృష్టి కేంద్రీకరించింది. అంతా ఇస్రో వైపు చూస్తోంది. ఇస్రో  ఈసారి ఏం చేయనుందనేది ఆసక్తి రేపుతోంది.

Gaganyaan Launch: చంద్రయాన్ విజయం సాధించిన రోజుల వ్యవధిలోనే ఇస్రో విజయవంతంగా సూర్యునిపైకి ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించింది. ఇప్పుడిక ఇస్రో గగన్‌యాన్‌కు సిద్ధమౌతోంది. గగన్‌యాన్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఉండవచ్చని అంచనా.

1 /7

గగన్‌యాన్ మిషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కావాలనే ఆలోచనతో ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇది మానవ మిషన్ కావడంతో అత్యంత జాగ్రత్తగా అన్ని విషయాలు పరిశీలిస్తున్నారు.

2 /7

అంతరిక్ష యాత్రికుల్ని ఎంపిక చేయమని ఇస్రో భారత వైమానిక దళానికి సూచించింది. ఈ మిషన్‌లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్‌లను కూడా భాగం చేశారు. ఎయిర్‌ఫోర్స్ నుంచి కూడా కొంతమంది సైనికుల్ని ఎంపిక చేశారు. బెంగళూరులో వీరికి శిక్షణ జరుగుతోంది.

3 /7

గగన్‌యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్‌లో భాగంగా అంతరిక్ష యాత్రికుల్ని పంపించనున్నారు. గగన్‌యాన్ మిషన్ కింద ఇస్రో తన ఆస్ట్రోనాట్స్‌ను భూమి నుంచి 400 కిలోమీటర్ల పైన తిప్పనుంది.

4 /7

మొదటి, రెండవ పరీక్షలు విజయవంతమైన తరువాత 2024 చివరినాటికి మిషన్ ప్రయోగించవచ్చు.

5 /7

మొదటి పరీక్ష టీవీ-డీ1 2023లో ఉండవచ్చు. ఆ తురవాత రెండవది టీవీ-డీ2 2024 తొలి త్రైమాసికంగా ఉండే అవకాశాలున్నాయి. ఇది తొలి మానవ రహిత మిషన్ కానుంది. 

6 /7

అక్టోబర్ నెలలో గగన్‌యాన్ ప్రయోగం ఉండవచ్చని చెప్పిన కేంద్ర మంత్రి తేదీ ఎప్పుడనేది చెప్పలేదు. ఇంకా ఇస్రో నుంచి కూడా ఈ విషయంపై స్పష్టత లేదు.

7 /7

కేంద్ర మంత్రి జితేంద్ర సింహ్ అందించిన వివరాల ప్రకారం గగన్‌యాన్ ప్రాజెక్ట్ అక్టోబర్‌లో పరీక్షించవచ్చని తెలుస్తోంది.