Janhvi Kapoor: అచ్చం శ్రీదేవిలా కనిపించిన జాన్వి కపూర్.. చీరలో మెరిసిపోయిన నటి

Janhvi Kapoor as Sridevi:

బాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు చేసిన జాన్వి కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయాలు అవసరం లేదు. అందుకు ముఖ్య కారణం ఆమె శ్రీదేవి కూతురు కావడమే. ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

  • Mar 09, 2024, 14:00 PM IST
1 /6

టాలీవుడ్ అతిలోకసుందరి గా పేరు తెచ్చుకుంది అలనాటి హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవికి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమెను ఇప్పటికీ అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు.

2 /6

అలాంటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాలలో కనిపిస్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ధడక్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.  

3 /6

ఆ తరువాత ఎన్నో హిందీ సినిమాలలో నటించిన జాన్వి ఇంకా తెలుగు తెరపై మాత్రం కనిపించలేదు. అయితే మరి కొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాలా దర్శకత్వంలో వస్తున్న దేవరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది.

4 /6

మొదటి సినిమా దేవరా విడుదల కాకముందే.. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

5 /6

ఇక ఎప్పుడెప్పుడు జాన్వి కపూర్ తెలుగు సినిమాలు విడుదలవుతాయా ఆమెని వెండి ధర పైన చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

6 /6

తెలుపు రంగు పైన ఎరుపు పూలు ఉండే చీరలో కనిపిస్తూ జాన్వి కపూర్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ ఫోటోలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇందులో జాన్వి కపూర్ అచ్చం తన తల్లి శ్రీదేవిలా కనిపించడం.