Janhvi Kapoor: తంగం కొత్త ఫోటోలు.. మరింత హీటెక్కిస్టోన్న జాన్వి కపూర్..

Janhvi Kapoor unseen photos of thangam: జాన్వి కపూర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలై.. బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో జాన్వి కపూర్ క్యారెక్టర్ ఉన్నది కేవలం 10 నిమిషాలే ఆయన.. ఆ పది నిమిషాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ హీరోయిన్. తాజాగా ఈ చిత్రం తంగం క్యారెక్టర్ లో జాన్వి కపూర్ కొత్త ఫోటోలు షేర్ చేసి అందరినీ మరింత ఆకట్టుకుంది. 
 

1 /6

జాన్వి కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బోనీకపూర్, శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వి కపూర్.. ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. 

2 /6

ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తంగం క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది ఈ హీరోయిన్. 

3 /6

ఈ చిత్రంలో జాన్వి కనిపించింది కేవలం 10 నిమిషాలు మాత్రమే. కానీ ఉన్నంత పరిధిలోనే తన గ్లామర్ తో తెగ ఆకట్టుకుంది. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ ప్రేక్షకులను థియేటర్స్ లో ఉర్రూతలూగించింది. 

4 /6

తాజాగా ఈ సినిమాలోని తంగం క్యారెక్టర్ కి సంబంధించిన మరికొన్ని ఫోటోలు.. జాన్వి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాను దేవర కోసం చేసిన పడవ.. పైన పడుకొని ఆ పడవకి పెయింట్ వేస్తూ కనిపించింది తంగం. 

5 /6

ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రం తరువాత జాన్వి.. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న 16వ చిత్రంలో కూడా హీరోయిన్గా కనిపించనుంది.

6 /6

మరోపక్క దేవర 2 చిత్రంలో తంగం క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని.. ఇప్పటికే జాన్వి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె అభిమానులు ఈ రెండో భాగంలో ఆమె క్యారెక్టర్ కోసం పెద్ద ఎదురు చూస్తున్నారు.