Jio Affordable Plan: జియో కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జియో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో 70 రోజుల ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను కూడా ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
జియో రూ.666 రీఛార్జ్ ప్లాన్ లో అదిరిపోయే బెనిఫిట్స్ పొందుతారు. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ ఏ నెట్వర్క్ అయిన చేసుకోవచ్చు. అదనంగా 1.5 జీబీ డేటా పొందుతారు. మొత్తం 105 జీబీ హై స్పీడ్ డేటా పొందుతారు. ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్లతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ కూడా పొందుతారు.
ఇక 70 రోజుల బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.197 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో అపరిమిత ఫ్రీ కాల్స్ ఏ నెట్వర్క్ అయిన కాల్ చేసుకోవచ్చు. కానీ, ఇది మొదటి 18 రోజులు మాత్రమే వ్యాలిడిటీ అందిస్తుంది. ఆ తర్వాత మీరు కాల్స్ చేసుకోలేరు, డేటా వినియోగించుకోలేరు.
దీంతోపాటు 2 జీబీ హై స్పీడ్ డేటా కూడా పొందుతారు. కానీ, దీని వ్యాలిడిటీ కూడా కేవలం 18 రోజులు మాత్రమే వర్తిస్తుంది. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు మాత్రం వ్యాలిడిటీ పూర్తి అయ్యే వరకు ఉంటుంది. కానీ, కాల్స్, డేటా పొందలేరు. ఇది డేటా ఎక్కువగా వినియోగించేవారికి ఉపయోగపడదు
ఈ రెండు కంపెనీలు అందిస్తున్న 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ చూస్తే జియో బీఎస్ఎన్ఎల్ కంటే మూడింతలు బెట్టర్ బెనిఫిట్స్ పొందుతారు. కానీ, జియో కాస్త ధర ఎక్కువ ఉంది కానీ, ఇందులో ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి.డేటా ఎక్కువగా వినియోగించేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.
అయితే, బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ కాల్ లిమిట్ పూర్తయిన తర్వాత అంటే 18 రోజుల తర్వాత టాప్ అప్ చేయించుకోవాల్సి వస్తుంది. ఒక వేళ మీరు సెకండ్ సిమ్ కార్డు యాక్టీవ్‌గా ఉంచాలనుకుంటే ఈ ప్లాన్ బాగుంటుంది. దీంతో మీ సిమ్ కార్డు డియాక్టివేట్ కాకుండా చూసుకోవచ్చు.