Jio Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. 72 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ..!

Jio 72 Days Plan: జియో డేటా ధమాకా.. బంపర్‌ ఆఫర్ తీసుకువచ్చింది రిలయన్స్‌ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా ఎక్కువగా వినియోగించేవారికి జియో 72 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ సూపర్‌ ఆఫర్. అంతేకాదు ఈ ప్లాన్‌లో అదనంగా 20 జీబీ ఎక్కువ పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

రిలయన్స్‌ జియో టెలికామ్‌ కంపెనీ రకరకాల ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో మరో అద్భుతమైన ఆఫర్లు కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. దీంతో డేటా అదనంగా పొందుతారు. ఇందులో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో ఎక్కువ డేటా పొందవచ్చు.  

2 /5

జియో రూ.749 ప్లాన్‌ వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందుతారు. ఇందులో ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు.ఇందులో ప్రతిరోజూ 2 జీబీ డేటాతోపాటు 144 జీబీ డేటా వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు అందుకుంటారు.  

3 /5

జియో అదనంగా 20 జీబీ డేటాను అందిస్తుంది. దీంతో ఈ రీఛార్జీ ప్యాక్‌లో మీరు పూర్తిగా 164 జీబీ డేటా పొందుతారు.అంది కూడా 5జీ స్పీడ్‌ అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్. ఒకవేళ మీ ఏరియాల్లో జియో 5జీ కనెక్టివిటీ ఉంటే ఇది మీకు సూపర్‌ రీచార్జీ ప్లాన్.  

4 /5

అంతేకాదు ఈ రూ.749 రీఛార్జీ ప్లాన్‌లో ఉచితంగా ఓటీటీలు కూడా పొందవచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌ దీంతో మీకు ఓటీటీలో అదనంగా ఖర్చు భారం కూడా తగ్గుతుంది.ఇక అక్టోబర్‌ 1 నుంచి ట్రయ్ కొత్త టెలికాం రెగ్యలేషన్ తీసుకువచ్చింది. స్పామ్ మెసేజ్‌, ఫ్రాడ్ వెబ్‌సైట్‌ లింక్‌లు కంపెనీలు నివారించాలని ఆదేశించింది.   

5 /5

ఇదిలా ఉండగా జూన్‌ నెలలో టెలికాం కంపెనీలు అన్ని దేశవ్యాప్తంగా రీఛార్జీ ప్లాన్‌లపై ట్యారిఫ్‌ల ధరలను పెంచేసింది. దాదాపు 25 శాతం కూడా కొన్ని ప్యాక్‌లపై ధరలపు పెంచింది. జియో, ఎయిర్‌టెల్‌, వీఐలు కూడా ధరలను పెంచాయి